పాక్షిక లాక్‌డౌన్‌ : వాటిపై ప్రభావం - partial lockdown measures could impact movement of labour goods cii survey
close

Published : 11/04/2021 21:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పాక్షిక లాక్‌డౌన్‌ : వాటిపై ప్రభావం

న్యూదిల్లీ: పాక్షిక లాక్‌డౌన్‌ చర్యల వల్ల కూలీలు, వస్తువుల రవాణాపై ప్రభావం ఉంటుందని సీఐఐ సర్వేలో తెలిపింది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాలు నివారణ చర్యలకు ఉపక్రమించాయి. ఇందులో భాగంగా పలు ఆంక్షలు విధించాయి. రాత్రి కర్ఫ్యూ, వీకెండ్‌ లాక్‌డౌన్‌, మాస్క్‌ లేకుండా తిరిగే వారికి భారీ జరిమానా విధించడం వంటి చర్యలు తీసుకుంటున్నాయి. పలు రాష్ట్రాలు పాక్షిక లాక్‌డౌన్‌వైపు మొగ్గు చూపుతున్నాయి. అయితే, ఇలాంటి చర్యల వల్ల కూలీలను తరలించడం, వస్తు రవాణాపై ప్రభావం పడుతుందని అత్యధికమంది సీఈవోలు అభిప్రాయపడ్డారు. దీని వల్ల పారిశ్రామికోత్పత్తిపై ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

పాక్షిక లాక్‌డౌన్‌ కారణంగా కూలీలను సమకూర్చుకోవడం ఇబ్బందిగా మారుతుందని ఇది తమ సంస్థల ఉత్పత్తిపై ప్రభావం చూపుతుందని సగానికి పైగా సీఈవోలు తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు. దీని వల్ల సగానికి పైగా ఉత్పత్తి పడిపోతుందని పేర్కొన్నారు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని