వాహనాల ఎగుమతుల్లో తగ్గుదల - passenger vehicle exports tumble 39 pc in FY21
close

Published : 18/04/2021 20:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వాహనాల ఎగుమతుల్లో తగ్గుదల

దిల్లీ: కరోనా నేపథ్యంలో గత ఆర్థిక సంవత్సరం ప్రయాణికుల వాహనాల ఎగుమతులు 39 శాతం మేర పడిపోయాయి. తొలి ఆరు నెలల్లో లాక్‌డౌన్‌ల కారణంగా అంతర్జాతీయంగా సరఫరా గొలుసులో అంతరాయం ఏర్పడడం ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపింది. ద్వితీయార్ధంలో పరిస్థితులు మెరుగుపడినప్పటికీ.. 2019-2020 నాటి గణాంకాలను మాత్రం చేరుకోలేకపోయాయి.

సియామ్‌ గణాంకాల ప్రకారం.. 2019-20లో 6,62,118 యూనిట్లుగా ఉన్న ప్రయాణికుల వాహనాల ఎగుమతులు 2020-21 నాటికి 4,04,400 యూనిట్లకు పడిపోయాయి. వీటిలో కార్ల ఎగుమతులు 44.32 శాతం పడిపోగా.. యుటిలిటీ వాహనాలు 24.88 శాతం, వ్యాన్ల ఎగుమతులు 42.16 శాతం కుంగాయి.

ఇక కంపెనీలవారీగా చూస్తే.. హ్యుందాయ్‌ మోటార్‌ ఎగుమతులు 38.57 శాతం, మారుతీ సుజుకీ ఇండియా 5.34 శాతం, ఫోర్డ్‌ ఇండియా 64.96 శాతం, నిస్సాన్‌ మోటార్‌ ఇండియా 59.25 శాతం, ఫోక్స్‌వ్యాగన్‌ 44.1 శాతం, జనరల్‌ మోటార్స్‌ ఎగుమతులు 47.84 శాతం పడిపోయాయి. వీటికి భిన్నంగా హోండా మోటార్స్‌, కియా మోటార్స్‌ ఇండియా ఎగుమతుల్లో మాత్రం వృద్ధి నమోదుకావడం గమనార్హం. కియా మోటార్స్‌ ఎగుమతులు 88.43 శాతం పెరిగి 40,440 యూనిట్లుగా నమోదయ్యాయి. ఇక హోండా ఎగుమతులు 37.54 శాతం వృద్ధి చెంది 5,151 యూనిట్లుగా రికార్డయ్యింది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని