ప్యాసెంజర్‌ వాహనాల రిటైల్‌ విక్రయాల్లో 24% వృద్ధి - passenger vehicle retail sales increase 24 pc in december says fada
close

Published : 11/01/2021 15:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్యాసెంజర్‌ వాహనాల రిటైల్‌ విక్రయాల్లో 24% వృద్ధి

దిల్లీ: డిసెంబరులో ప్యాసెంజర్‌ వాహనాల రిటైల్‌ విక్రయాల్లో 23.99 శాతం వృద్ధి నమోదైనట్లు ‘ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆటోమొబైల్‌ డీలర్స్‌ అసోసియేషన్‌(ఎఫ్‌ఏడీఏ)’ వెల్లడించింది. 2019 డిసెంబరులో 2,18,775 యూనిట్ల అమ్మకాలు జరగ్గా.. ఈ డిసెంబరులో అవి 2,71,249కి పెరిగాయి. ద్విచక్రవాహనాల విక్రయాలు 2019, డిసెంబరులో 12,73,318 అమ్ముడయ్యాయి. ఈసారి అవి 11.88 శాతం పెరిగి 14,24,620 యూనిట్లు అమ్ముడుపోయాయి. ఇక వాణిజ్య వాహన విక్రయాలు ఈసారి తగ్గాయి. 2019 డిసెంబరులో 59,497 వాహనాలు అమ్ముడుకాగా.. ఈసారి అవి 13.52 శాతం తగ్గి 51,454 యూనిట్లకు పరిమితమైంది. ఇక త్రీవీలల్‌ విక్రయాలు సైతం 52.75 శాతం కుంగాయి. ట్రాక్టర్‌ అమ్మకాలు 35.49 శాతం పెరిగాయి. స్థూలంగా అన్ని విభాగాల్లో కలిపి డిసెంబరులో వాహన విక్రయాలు 11.01 శాతం పెరిగాయి. 2019, డిసెంబరులో 16,61,245 యూనిట్లు విక్రయించగా.. ఈ డిసెంబరులో ఆ సంఖ్య 18,44,143కు ఎగబాకింది.

ఇవీ చదవండి..

పసిడికి అమ్మకాల ఒత్తిడి!

సబ్బులు, బిస్కెట్ల ధరలూ పెరగనున్నాయ్‌


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని