భారత్‌లో సర్వీసులు నిలిపేయనున్న పేపాల్‌ - paypal to shut domestic payment services within india from apr 1
close

Published : 05/02/2021 20:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భారత్‌లో సర్వీసులు నిలిపేయనున్న పేపాల్‌

దిల్లీ: దేశీయంగా ఏప్రిల్‌ 1 నుంచి తమ సర్వీసులు నిలిపేయనున్నట్లు డిజిటల్‌ చెల్లింపుల సంస్థ పేపాల్‌ ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం పేపాల్‌ ప్రతినిధులు వెల్లడించారు. ‘‘ భారత వ్యాపారాల్లో మా పెట్టుబడులు పెట్టనున్నాం. ఇకపై భారతీయ వ్యాపారాలను అంతర్జాతీయంగా విస్తరించేందుకు కృషి చేస్తాం.’’ అని వారు తెలిపారు. గతేడాదిలో 1.4 బిలియన్‌ అమెరికన్‌ డాలర్ల విలువైన 3.6 లక్షల వ్యాపారాలను పేపాల్‌ నిర్వహించిందని వెల్లడించారు. వినియోగదారులకు అవసరమైన సేవలను అందిస్తూ భారత్‌ ఆర్థిక వృద్ధిలో పాలుపంచుకుందని పేపాల్‌ ప్రతినిధులు తెలిపారు. ఏప్రిల్‌ 1 నుంచి భారతీయ ఉత్పత్తులను అంతర్జాతీయ స్థాయికి చేర్చేందుకు దృష్టి పెడతామన్నారు. అమెరికాకు చెందిన పేపాల్‌ సంస్థ భారత్‌లో స్విగ్గీ, బుక్‌మై షో వంటి ప్లాట్‌ఫాంలకు చెల్లింపులు చేసేందుకు ఉపయోగపడుతోంది. ప్రస్తుతం ఇది ఈబే అనుబంధ సంస్థగా కొనసాగుతోంది.

ఇవీ చదవండి..

సాగు చట్టాల్లో నలుపు ఏంటి?

భారత్‌లో వెనక్కి తగ్గిన ఫైజర్‌


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని