వాట్సాప్ కొత్త పాలసీ: నిర్ణయం మీదే - paytm ceo posts move on to signal now
close

Published : 11/01/2021 22:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వాట్సాప్ కొత్త పాలసీ: నిర్ణయం మీదే

మెసేజింగ్ యాప్ తీరును వ్యతిరేకిస్తూ పేటీఎం సీఈఓ ట్వీట్

దిల్లీ: మేసేజింగ్ యాప్ వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీ నేపథ్యంలో..ఆ యాప్‌ను వాడొద్దని చెప్పే ప్రముఖుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పుడు ఆ జాబితాలోకి పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ వచ్చి చేరారు. ఫేస్‌బుక్, వాట్సాప్‌ల గుత్తాధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ..సిగ్నల్ యాప్ వాడకంవైపే మొగ్గు చూపారు.

‘మార్కెట్‌కు శక్తి ఉందని వారు అంటున్నారు. మనం అతి పెద్ద మార్కెట్. భారత్‌లో ఫేస్‌బుక్, వాట్సాప్ వాటి గుత్తాధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తున్నాయి. వినియోగదారుల గోప్యతను పణంగా పెడుతున్నాయి. ఇప్పుడు మనం ‘సిగ్నల్’ వైపు సాగాలి. బాధితులుగా మిగలాలా లేక అలాంటి చర్యలను వ్యతిరేకించాలా అనేది ఇప్పుడిక మన నిర్ణయమే’ అని శర్మ ట్వీట్ చేశారు. 

ఫేస్‌బుక్‌కి చెందిన వాట్సాప్ కొత్త టర్మ్స్ అండ్ ప్రైవసీ పాలసీని తీసుకొస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 8వ తేదీ నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. అప్‌డేట్ చేసిన కొత్త పాలసీని యూజర్స్ అంగీకరించని తరుణంలో వారి ఖాతా తొలగించనున్నట్లు అందులో పేర్కొంది. ఈ కొత్త పాలసీ అమలుతో యూజర్‌కి సంబంధించిన సమాచారం వాట్సాప్ ఫేస్‌బుక్‌తో షేర్‌ చేసుకోనుంది. ఈ నిర్ణయంపై యూజర్స్ పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాట్సాప్ మాత్రం డేటా షేరింగ్‌కు సంబంధించి ఎలాంటి మార్పులు చేయలేదని చెప్తోంది. ఈ క్రమంలో పోటీ సంస్థలైన సిగ్నల్, టెలీగ్రామ్ డౌన్‌లోడ్లు పెరుగుతున్నాయి. వాట్సాప్‌ కొత్త పాలసీని వ్యతిరేకిస్తూ..ఇదివరకే టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్‌ కూడా సిగ్నల్ యాప్‌ను వినియోగించుకోవాలని ట్వీట్ చేశారు. 

ఇవీ చదవండి:

డేటా షేరింగ్‌పై వాట్సాప్ వివరణ

ఇందుకా మేం పార్టీలకు విరాళాలిచ్చేది?


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని