ఇంటర్నెట్‌డెస్క్ : కేంద్ర ప్రభుత్వం 2020-21 బడ్జెట్లో పింఛను మొత్తాన్ని కూడా ఆదాయపు పన్ను పరిధిలోకి చేర్చింది. దీంతో 60 నుంచి 80 ఏళ్ల మధ్యలోని సీనియర్ సిటిజన్ల ఆదాయం 3 లక్షలు దాటితే.. అదే 80 ఏళ్లకు పైబడిన వారి ఆదాయం రూ.5లక్షలు మించితే చట్టప్రకారం పన్ను విధించేవారు. ఆ బడ్జెట్ సమయంలో ఆదాయాలను పెంచడం కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమైన సవాలు. ఎందుకంటే అప్పటికే కొత్తగా ప్రవేశపెట్టిన జీఎస్టీ విధానం పూర్తిగా కుదురుకోలేదు. కానీ, ఆ తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. దేశవ్యాప్తంగా కరోనా వ్యాపించడం.. లాక్డౌన్ విధించడంతో ప్రజల ఆదాయ వనరులు గణనీయంగా పడిపోయాయి.
వృద్ధులపై వడ్డీరేట్ల భారం..
జీవితం మలిదశలో వృద్ధులు తాము దాచుకొన్న సొమ్ముపై వచ్చే ఆదాయంతో శేష జీవితం గడుపుతుంటారు. వారికి శరీరం సహకరించకపోవడంతో మరో పని చేయలేరు. ఇటీవల కాలంలో వ్యాపార కార్యకలాపాలకు అవసరమైన మూలధనం తేలిగ్గా లభించేందుకు మార్కెట్లలోకి నగదు ప్రవాహం పెరిగేలా ఆర్బీఐ రుణ వడ్డీరేట్లను తగ్గించింది. దీంతో సహజంగానే డిపాజిట్లపై కూడా బ్యాంకులు వడ్డీరేట్లను తగ్గించాయి. ఇది వృద్ధులకు శాపంగా మారింది. వారి డిపాజిట్లపై వచ్చే వడ్డీ ఆదాయం తగ్గడంతో జీవిత అవసరాలను తగ్గించుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. కొన్నేళ్లుగా ఇదే పరిస్థితి నెలకొంది. మరోపక్క పింఛన్ సొమ్ము.. వడ్డీ సొమ్ముపై ప్రభుత్వం పన్ను విధిస్తోంది. మరోపక్క కరోనా వ్యాప్తి ఫలితంగా వైద్య ఖర్చులు కూడా పెరిగిపోయాయి. ఈ ప్రభావం అత్యధికంగా పడేది వృద్ధులపైనే. ఇప్పటికే తీసుకొన్న ఆరోగ్య బీమాలు కొవిడ్‌కు వర్తించకపోవడంతో.. కొత్తవి తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇదోక అదనపు భారంగా మారింది.
మినహాయింపుతో మరింత బలం..
సీనియర్ సిటిజన్లకు లభించే పింఛన్లపై పన్ను మినహాయింపు పరిధిని పెంచడమో .. లేదా పన్ను తొలగించడమో చేస్తే ప్రయోజనకరంగా ఉంటుంది. వాస్తవానికి వారు ఉద్యోగాలు చేసే సమయంలో జీతాలపై పన్నులు చెల్లిస్తారు. పలువురు ఆర్థిక మంత్రలు బడ్జెట్ల సమయంలో ఉద్యోగులు మాత్రమే నిజాయతీగా పన్నులు చెల్లిస్తారని అంగీకరించారు. ఈ నేపథ్యంలో సీనియర్ సిటిజన్లు తమ డిపాజిట్లపై వడ్డీ లేదా పింఛన్ స్కీముల నుంచి లభించే యాన్యూటీలపై విధించే పన్నును మినహాయిస్తే వారి చేతిలో నగదు ఉంటుంది. ఇది వారి వ్యయ సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది. వృద్ధుల చేతిలో నగదును తగ్గించే విధంగా సరికొత్త సెస్సులు, సర్‌చార్జీలను ప్రభుత్వం విధించకపోతే మరికొంత ఊరట లభిస్తుంది. కొత్త ఛార్జీలు వారి ఆదాయాన్ని మరింత తగ్గించేస్తాయి.
కొవిడ్ సమయంలో ప్రభుత్వం కూడా ఆర్థిక వ్యవస్థలో డిమాండ్‌ను పెంచేందుకు ప్రజల్లో వ్యయ సామర్థ్యాన్ని పెంచే అంశాలపై దృష్టిపెట్టింది. ఈ నేపథ్యంలో వృద్ధుల ఆదాయ వనరులపై పన్ను మినహాయింపు రెండు రకాలుగా ఉపయోగపడుతుంది. దీంతోపాటు వారు ఆ మొత్తాలను పెట్టుబడుల రూపంలో మారిస్తే ఆర్థిక వ్యవస్థకు మరింత బలం చేకూరుతుంది. ఈ సారి ప్రభుత్వం పన్ను రహిత పింఛన్ స్కీమ్‌ను ప్రవేశపెట్టే అవకాశం కూడా ఉంది.
ఇవీ చదవండి
ఈసారికి ‘లోటు’పాట్లను పట్టించుకోకుండా..!
ఈ బడ్జెట్ భిన్నం.. ఎందుకంటే..?
మరిన్ని
మీ ప్రశ్న
సిరి జవాబులు
-
Q. హాయ్ సిరి, నా పేరు శ్రీధర్. నేను రూ. 50 లక్షలకు టర్మ్ పాలసీ తీసుకుందాం అని అనుకుంటున్నాను , మంచి టర్మ్ పాలసీ చెప్పగలరు.
-
Q. నా పేరు ప్రదీప్, హైదరాబాద్ లో నివసిస్తాను. నేను హెచ్డీఎఫ్సీ లైఫ్ ప్రో గ్రోత్ ప్లస్ డెత్ బెనిఫిట్ ప్లాన్ లో గత 3 ఏళ్ళు గా సంవత్సరానికి రూ. 30,000 మదుపు చేస్తున్నాను. హెచ్డీఎఫ్సీ వారు నాకు ఈ పధకం 5 ఏళ్ళు మాత్రమే అని చెప్పారు, అయితే ఇప్పుడు పాలసీ లో చుస్తే 15 ఏళ్ళు అని చూపిస్తోంది. ఈ విషయమై ఆరా తీస్తే కనీస పరిమితి 5 ఏళ్ళు , ఆ తరువాత దీన్ని కొనసాగించాలా వద్ద అనే నిర్ణయం మనం తీసుకోవచ్చని తెలిసింది. ఇప్పుడు నేనేం చేయాలి? దీన్ని కొనసాగించాలా వద్దా? ఇంకా ఎందులో అయితే బాగుంటుంది?
-
Q. సర్ నేను ఏటీఎంలో విత్‌డ్రా చేసేందుకు ప్రయత్నించినప్పుడు నగదు రాలేదు కాని ఖాతా నుంచి డెబిట్ అయింది. బ్యాంకులో ఫిర్యాదు చేసి 15 రోజులు అయింది. కానీ ఇప్పటి వరకు నగదు తిరిగి క్రెడిట్ కాలేదు. బ్యాంకు వారు ఫిర్యాదుకు సరిగా స్పందించడంలేదు. ఇప్పుడు ఏం చేయాలి?