Online Shopping: ఆన్‌లైన్‌ షాపింగ్‌పై కస్టమర్లు ఏమంటున్నారు? - peoples concern about online shopping
close

Published : 30/07/2021 15:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Online Shopping: ఆన్‌లైన్‌ షాపింగ్‌పై కస్టమర్లు ఏమంటున్నారు?

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలో ఆన్‌లైన్‌ షాపింగ్‌ బాగా పెరిగింది. గతంలో ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేయనివారు కూడా కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో బయట షాపింగ్‌కు వెళ్లే వీలులేక ఆన్‌లైన్‌ కొనుగోళ్లు ప్రారంభించారు. అయితే, ఆన్‌లైన్‌ షాపింగ్‌ విషయంలో కస్టమర్లు ఎలాంటి వాటిని కోరుకుంటారు? వేటికి ప్రాధాన్యత ఇస్తున్నారనే అంశాలపై క్వాలట్రిక్స్‌ ఫర్‌ శాప్‌ కస్టమర్‌ ఎక్స్‌పీరియన్స్‌ సంస్థ ఒక సర్వే నిర్వహించింది. అందులో ఏమి తేలిందంటే..

సర్వేలో పాల్గొన్న కస్టమర్లలో 85 శాతం మంది వస్తువులను చెప్పిన సమయానికి డెలివరీ చేస్తేనే కొనుగోలు చేస్తామని చెప్పారు. మరోవైపు 81 శాతం మంది ఆన్‌లైన్‌షాపింగ్‌ చేసే సమయంలో బ్రాండ్‌కు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ముఖ్యంగా లావాదేవీలు జరిపే విషయంలో ఎక్కువ వెసులుబాటు కల్పించే(ఆన్‌లైన్‌ లేదా క్యాష్ ఆన్‌ డెలివరీ) వాటినే కొనడానికి ఇష్టపడతున్నారని సర్వేలో తేలింది. ఆహారం విషయంలో కస్టమర్లు ఆరోగ్యకరమైన ఫుడ్‌నే ఆర్డర్‌ చేస్తున్నారట. 79శాతం మంది స్థానిక ఆర్గానిక్‌ ఉత్పత్తులను ఆర్డర్‌ చేయడానికి మొగ్గుచూపుతున్నారు. మరోవైపు సమాచార భద్రతపై కస్టమర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 84శాతం మంది ఆన్‌లైన్‌లో తమ వ్యక్తిగత సమాచారం ఎక్కడెక్కడా వాడుతున్నారో తెలుసుకోవాలనుకుంటున్నట్లు సర్వే చేసిన సంస్థ వెల్లడించింది. 

‘‘గత సంవత్సరకాలంగా అనేక వ్యాపారాలు డిజిటలైజేషన్‌లో భాగమైనప్పటికీ.. కస్టమర్‌కు సంబంధించి ప్రాథమిక అంశాలను ఇంకా చేరుకోలేకపోతున్నాయి. కస్టమర్‌ ఇష్టాయిష్టాలకు అనుగుణంగా కంపెనీలు డిజిటలైజ్‌ కావాల్సిన అవసరముంది’’ అని ఈ సర్వే నిర్వహించిన శాప్‌ కస్టమర్‌ ఎక్స్‌పీరియన్స్‌ సంస్థ ప్రతినిధి పెగ్గీ రెండర్‌ అభిప్రాయపడ్డారు. 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని