వరుసగా నాలుగో రోజు పెరిగిన చమురు ధరలు - petrol and diesel prices hiked for fourth consecutive day
close

Published : 07/05/2021 10:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వరుసగా నాలుగో రోజు పెరిగిన చమురు ధరలు

దిల్లీ: కొద్ది రోజులపాటు స్థిరంగా ఉన్న చమురు ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. వరుసగా నాలుగో రోజు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగాయి. పెట్రోల్‌పై 28 పైసలు, డీజిల్‌పై 31 పైసల చొప్పున పెంచుతూ ప్రభుత్వ రంగ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దేశ రాజధాని దిల్లీలో పెట్రోల్‌ ధర రూ.91 దాటింది. దిల్లీలో గురువారం పెట్రోల్‌ ధర రూ.90.99 ఉండగా నేడు పెరిగిన ధరలతో  రూ.91.27కు చేరింది. డీజిల్‌ ధర గురువారం రూ.81.42 ఉండగా నేడు రూ.81.73కి చేరింది. హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.94.68, లీటర్‌ డీజిల్‌ ధర రూ.89.11కు చేరింది. ముంబయిలో పెట్రోల్‌ ధర రూ.97.61, డీజిల్‌ ధర రూ.88.82గా ఉంది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని