రూ. 90కి చేరువలో పెట్రోల్‌ ధర - petrol diesel prices hiked by 25 paise
close

Published : 27/01/2021 11:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రూ. 90కి చేరువలో పెట్రోల్‌ ధర

హైదరాబాద్‌: దేశంలో ఇంధన ధరలు మళ్లీ పరుగులు పెడుతున్నాయి. కొత్త రికార్డుల్లో దూసుకుపోతున్నాయి. దేశ రాజధానిలో బుధవారం పెట్రోల్‌, డీజిల్‌పై మరో 25పైసలు పెరిగింది. దీంతో దిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర అత్యంత గరిష్ఠానికి చేరి రూ. 86.30గా ఉంది. ఇక డీజిల్‌ ధర కూడా రూ.76.48కి చేరింది.

హైదరాబాద్‌లో పెట్రోల్‌ ధర రూ.90కి చేరువలో ఉంది. బుధవారం 26 పైసలు పెరగడంతో నగరంలో లీటర్‌ పెట్రోల్ రూ. 89.77గా ఉంది. ఇక దేశ వాణిజ్య రాజధాని ముంబయిలో అత్యధికంగా రూ. 92.86కి చేరింది. కోల్‌కతాలో రూ.87.69, చెన్నైలో రూ. 88.82గా ఉంది. మరోవైపు డీజిల్‌ ధర హైదరాబాద్‌లో రూ. 83.46, ముంబయిలో రూ. 83.30, కోల్‌కతాలో రూ. 80.08, చెన్నైలో రూ. 81.71కి చేరింది. 

కొత్త ఏడాదిలో ఇప్పటివరకు పెట్రోల్‌ ధర రూ. 2.59, డీజిల్‌ ధర రూ. 2.61 పెరగడం గమనార్హం. దాదాపు నెలరోజుల పాటు స్థిరంగా ఉన్న ఇంధన ధరలు జనవరి 6 నుంచి మళ్లీ పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ మొదలవడంతో అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరిగాయి. దీంతో వీటికి అనుగుణంగా దేశీయ చమురు సంస్థలు కూడా ధరలను సవరిస్తున్నాయి.

ఇవీ చదవండి..

జయహో భారత్‌

టాటా మోటార్స్‌ కొత్త సఫారీ


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని