భగ్గుమంటున్న పెట్రోల్‌ ధరలు - petrol diesel prices reach new highs
close

Published : 18/01/2021 10:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భగ్గుమంటున్న పెట్రోల్‌ ధరలు

దిల్లీ: దేశంలో చమురు ధరలు భగ్గుమంటున్నాయి. వాహనదారుల జేబులు గుల్లవుతున్నాయి. సోమవారం పెట్రోల్‌ ధర లీటర్‌పై 25 పైసలు, డీజిల్‌ ధర 25 పైసలు చొప్పున పెరిగింది. దీంతో ఇంధన ధరలు కొత్త గరిష్ఠానికి చేరుకున్నాయి. తాజా పెంపుతో దేశ రాజధానిలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.84.95కు చేరింది. డీజిల్‌ ధర రూ.75.13గా ఉంది. దేశీయ అతిపెద్ద ఇంధన రిటైల్‌ సంస్థ ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ ధరల ప్రకారం.. పెట్రోల్‌ ధర ముంబయిలో అత్యధికంగా రూ.91.56గా ఉంది. చెన్నైలో రూ.87.63, కోల్‌కతాలో రూ.86.39కి చేరింది. ఇక డీజిల్‌ ధర ముంబయిలో రూ.81.87, చెన్నైలో రూ.80.43, కోల్‌కతాలో రూ.78.72గా ఉంది. 

హైదరాబాద్‌లోనూ అత్యధికంగా..

హైదరాబాద్‌లోనూ ఇంధన ధరలు నానాటికీ చుక్కలను తాకుతున్నాయి. నగరంలో సోమవారం పెట్రోల్‌ ధర లీటర్‌పై 26 పైసలు పెరిగింది. దీంతో లీటర్‌ ధర రూ.88.37కు చేరింది. డీజిల్‌ ధర కూడా 26 పైసలు పెరిగి రూ.81.99గా ఉంది. ప్రధాన నగరాలతో పోలిస్తే డీజిల్‌ ధర హైదరాబాద్‌లోనే అత్యధికంగా ఉండటం గమనార్హం.

ఇవీ చదవండి..

జీడీపీ 25 శాతం క్షీణిస్తుంది

2030కి 100 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి లక్ష్యం


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని