ఏడాదిలో తొలిసారి ఇంధన ధరల తగ్గింపు - petrol price cut by 18 paise diesel by 17 paise
close

Updated : 24/03/2021 11:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఏడాదిలో తొలిసారి ఇంధన ధరల తగ్గింపు

దిల్లీ: దేశంలో ఇంధన ధరలు బుధవారం స్వల్పంగా తగ్గాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పడిపోవడంతో దేశీయ చమురు సంస్థలు లీటర్‌ పెట్రోల్‌ 18పైసలు, డీజిల్‌పై 17 పైసలు తగ్గిస్తూ నిర్ణయించాయి. దీంతో దేశ రాజధాని దిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర ఇంతకుముందు రూ.91.17 ఉండగా.. 18పైసలు తగ్గి రూ.90.99కి చేరింది. ఇక డీజిల్‌ ధర రూ.81.47 ఉండగా.. 17 పైసలు తగ్గి రూ.81.30 చేరింది. దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో బుధవారం లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.97.40, డీజిల్‌ ధర రూ.88.42గా నమోదైంది. ఇక హైదరబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.94.61గా, డీజిల్‌ ధర రూ.88.67గా ఉంది. 

గత కొంత కాలంగా దేశంలో ఇంధన ధరల్లో భారీగా పెరుగుదల నమోదైన విషయం తెలిసిందే. గతేడాది మార్చి 16 తర్వాత దేశంలో పెట్రో ధరలు తగ్గించడం ఇదే తొలిసారి. ఏడాది కాలంలో ముడి చమురు ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ.. దేశంలో పెట్రోల్‌పై రూ.21.58, డీజిల్‌పై రూ.19.18 పెరగడం గమనార్హం. గత నెలలో రాజస్థాన్‌, మహారాష్ట్ర, మద్యప్రదేశ్‌ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో పెట్రోల్‌ ధరలు రూ.100 మార్కును చేరుకున్న విషయం తెలిసిందే.మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని