దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో పెట్రోల్ ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. శుక్రవారం(జనవరి 22) ఉదయం లీటర్ పెట్రోల్ ధర 85.45కి చేరింది. నిన్న ఈ ధర రూ.85.20గా ఉంది. మరోవైపు, లీటర్ డీజిల్ రూ. 75.63 పలికింది. పెట్రోల్, డీజిల్ ధరలపై చమురు సంస్థలు 25 పైసలు పెంచడంతో ఈ మార్పులు చోటుచేసుకున్నాయి. తాజా పెంపుతో ఆర్థిక రాజధాని ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర అత్యధికంగా రూ.92.04కి చేరుకుంది.
ఇక పెట్రోల్ ధర కోల్కతాలో రూ. 86.87, చెన్నైలో రూ. 88.16, హైదరాబాద్లో రూ. 88.89గా ఉంది. డీజిల్ ధర ముంబయిలో రూ. 82.40, కోల్కతాలో రూ. 79.23, చెన్నైలో రూ. 80.99, హైదరాబాద్లో రూ. 82.53కి చేరింది. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా దేశీయంగా చమురు సంస్థలు రోజువారీ ధరల సవరన చేపడుతాయి. అయితే ఆయా రాష్ట్రాల్లో అమల్లో ఉన్న సేల్స్ ట్యాక్స్/ వ్యాట్ ఆధారంగా ఈ ధరల్లో మార్పులు ఉంటాయి.
ఇవీ చదవండి:
ఈ పని చేస్తే..మస్క్ రూ.730 కోట్లు ఇస్తారట!
మరిన్ని
మీ ప్రశ్న
సిరి జవాబులు
-
Q. హాయ్ సిరి, నా పేరు శ్రీధర్. నేను రూ. 50 లక్షలకు టర్మ్ పాలసీ తీసుకుందాం అని అనుకుంటున్నాను , మంచి టర్మ్ పాలసీ చెప్పగలరు.
-
Q. నా పేరు ప్రదీప్, హైదరాబాద్ లో నివసిస్తాను. నేను హెచ్డీఎఫ్సీ లైఫ్ ప్రో గ్రోత్ ప్లస్ డెత్ బెనిఫిట్ ప్లాన్ లో గత 3 ఏళ్ళు గా సంవత్సరానికి రూ. 30,000 మదుపు చేస్తున్నాను. హెచ్డీఎఫ్సీ వారు నాకు ఈ పధకం 5 ఏళ్ళు మాత్రమే అని చెప్పారు, అయితే ఇప్పుడు పాలసీ లో చుస్తే 15 ఏళ్ళు అని చూపిస్తోంది. ఈ విషయమై ఆరా తీస్తే కనీస పరిమితి 5 ఏళ్ళు , ఆ తరువాత దీన్ని కొనసాగించాలా వద్ద అనే నిర్ణయం మనం తీసుకోవచ్చని తెలిసింది. ఇప్పుడు నేనేం చేయాలి? దీన్ని కొనసాగించాలా వద్దా? ఇంకా ఎందులో అయితే బాగుంటుంది?
-
Q. సర్ నేను ఏటీఎంలో విత్డ్రా చేసేందుకు ప్రయత్నించినప్పుడు నగదు రాలేదు కాని ఖాతా నుంచి డెబిట్ అయింది. బ్యాంకులో ఫిర్యాదు చేసి 15 రోజులు అయింది. కానీ ఇప్పటి వరకు నగదు తిరిగి క్రెడిట్ కాలేదు. బ్యాంకు వారు ఫిర్యాదుకు సరిగా స్పందించడంలేదు. ఇప్పుడు ఏం చేయాలి?