మండుతున్న పెట్రోల్‌ ధరలు - petrol prices hit new record
close

Published : 19/01/2021 10:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మండుతున్న పెట్రోల్‌ ధరలు

దిల్లీలో లీటర్‌ ధర రూ. 85పైనే

దిల్లీ: దేశంలో ఇంధన ధరలు మళ్లీ పరుగులు పెడుతున్నాయి. వరుసగా రెండో రోజు ధరలు పెరగడంతో దేశ రాజధాని దిల్లీలో పెట్రోల్‌ ధర రూ.85 మార్క్‌ దాటింది. అటు డీజిల్‌ కూడా రూ.75పైనే ఉంది. మంగళవారం పెట్రోల్‌, డీజిల్‌పై లీటర్‌కు 25పైసల చొప్పున చమురు సంస్థలు పెంచాయి. దీంతో దిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.85.20, డీజిల్‌ ధర రూ. 75.38గా ఉంది.

దేశ వాణిజ్య రాజధాని ముంబయిలో పెట్రోల్‌ ధర అత్యధికంగా రూ.91.80కి చేరింది. చెన్నైలో రూ.87.85, కోల్‌కతాలో రూ.86.63గా ఉంది. డీజిల్‌ ధర ముంబయిలో రూ.82.13, చెన్నైలో రూ.80.67, కోల్‌కతాలో రూ.78.97కి చేరింది. హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ మంగళవారం 26 పైసలు పెరిగి రూ.88.63, డీజిల్‌ 27పైసలు పెరిగి రూ.82.26గా ఉంది.

జనవరి 13,14 తేదీల్లో రెండు విడతలుగా లీటరకు 50పైసలు చొప్పున పెంచిన చమురు కంపెనీలు.. మూడు రోజుల విరామం తర్వాత సోమవారం నుంచి మళ్లీ భారం మోపుతున్నాయి. గత వారం రోజుల్లో పెట్రోల్‌ ధర రూపాయి పెరగడం గమనార్హం.

ఇవీ చదవండి..

అదానీ గ్రూప్‌లోకి రూ.18,200 కోట్లు

ఆర్థిక మంత్రికి అండదండలు


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని