ఈ టైంలో ప్రైవేటీకరణా..?అదో ప్రమాదకర ఆలోచన! - privatisation of cpses during recession a horrible idea pronab sen
close

Published : 18/02/2021 11:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఈ టైంలో ప్రైవేటీకరణా..?అదో ప్రమాదకర ఆలోచన!

దిల్లీ: మాంద్యం నెలకొన్న పరిస్థితుల్లో ప్రభుత్వ రంగ సంస్థలను(సీపీఎస్‌ఈ) ప్రైవేటీకరించాలనేది భయంకరమైన ఆలోచనేనని గణాంకాల విభాగం మాజీ చీఫ్‌ ప్రణబ్‌ సేన్‌ వెల్లడించారు. వాణిజ్య, పరిశ్రమల విభాగానికి చెందిన పీహెచ్‌డీసీసీఐ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తన బడ్జెట్‌ ప్రసంగంలో ఉద్యోగ ప్రపంచానికి సంబంధించిన విషయాలను ప్రస్తావించలేదని వెల్లడించారు. 

‘ఆర్థిక వ్యవస్థ అనుకూలంగా ఉన్నప్పుడు ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ చేయడం మేలు. కానీ, మాంద్యం నెలకొన్న సమయంలో ప్రైవేటీకరణ చేయాలనే ఆలోచన భయకరమైనది. ఆర్థిక రంగం మరింత క్షీణించిన ఈ సమయంలో ప్రస్తుత అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించాలనే ఆలోచన తప్పే’ అని ప్రణబ్‌ పేర్కొన్నారు. 

‘ఈ సారి బడ్జెట్‌ ప్రసంగంలో ఆర్థిక మంత్రి సీతారామన్‌ గతానికి భిన్నంగా ఉపాధి అంశాలను ప్రస్తావించలేదు. అంతేకాకుండా బడ్జెట్‌లో కొన్ని అతిపెద్ద ప్రాజెక్టులకు నిధులు సైతం కేటాయించలేదు. కేవలం ఎంఎస్‌ఎంఈ రంగం గురించి మాత్రమే ఆర్థికమంత్రి ప్రస్తావించారు’ అని ప్రణబ్‌ సేన్‌ అభిప్రాయపడ్డారు. కాగా, ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల అమ్మకం ద్వారా.. వచ్చే ఏడాది ఏప్రిల్‌ నాటికి రూ.1.75లక్షల కోట్లు సమీకరించాలనేది కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం ఈ ప్రైవేటీకరణ జాబితాలో రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఒక బీమా కంపెనీ ఉన్నాయి. 

ఇవీ చదవండి
ఒక్క మిస్డ్‌ కాల్‌తో పర్సనల్‌ లోన్‌

మహారాష్ట్రపై మళ్లీ కరోనా పంజా!


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని