క్రెడిట్ కార్డు వల్ల కలిగే లాభన‌ష్టాలు - pros-and-cons-of-using-a-credit-card
close

Published : 10/03/2021 17:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

క్రెడిట్ కార్డు వల్ల కలిగే లాభన‌ష్టాలు

క్రెడిట్ కార్డ్ అనేది వ్యక్తిగత రుణం లాంటిది, ఇది వినియోగదారులకు  సులభంగా లభిస్తుంది. క్రెడిట్ కార్డులుతో వ‌స్తువులు కొనుగోలు చేసిన‌ప్పుడు లావాదేవీల సౌలభ్యాన్ని కూడా అందిస్తాయి. ముందుగా వస్తువులను కొనుగోలు చేసి తరువాత నెల‌వారిగా చెల్లించే స‌దుపాయం కూడా ఉంది.  అయినప్పటికీ, వడ్డీ వ్యయం పరంగా రుణం తీసుకోవటానికి ఇవి చాలా ఖరీద‌నే చెప్పుకోవాలి.

అంతేకాకుండా, ఇటువంటి సౌలభ్యం అధిక ఖర్చు, రుణాలు తీసుకోవడం వంటి అలవాట్లను ప్రేరేపిస్తుంది.

 క్రెడిట్ కార్డును ఉపయోగించడం వ‌ల‌న క‌లిగే లాభాలు, నష్టాలను పరిశీలిస్తే..
మీ అన్ని నెలవారీ చెల్లింపులకు క్రెడిట్ కార్డ్ ఒక గొప్ప పద్ధతి, కానీ అత్యవసర రుణం సుల‌భంగా పొందటానికి ఇది ఉత్తమ ఎంపిక కాకపోవచ్చు
 ప్ర‌యోజ‌నాలు:
* కొనుగోలు శక్తిని పెంచుతుంది. రుణగ్రహీత చెల్లించగలిగే నిధుల కంటే ఎక్కువ కొనుగోలు చేయవచ్చు
* క్రెడిట్ కార్డులతో చెల్లింపు చేస్తే రివార్డ్ పాయింట్లు ల‌భిస్తాయి. వీటిని చెల్లింపుల స‌మ‌యంలో ఉప‌యోగించుకోవ‌చ్చు. కాని రివార్డ్ పాయింట్ల నిష్పత్తి కార్డ్ రకం, కార్డు జారీచేసే వ్యక్తిని బ‌ట్టి మారుతుంది
 * క్రెడిట్ రికార్డ్ సృష్టించడానికి సహాయపడుతుంది
 * క్రెడిట్ కార్డ్ జారీచేసేవారు సాధారణంగా చిన్న‌ వ్యాపారులతో  ఒప్పందాలు కలిగి ఉంటారు
* క్రెడిట్ కార్డులు కాంప్లిమెంటరీ విమానాశ్రయం లాంజ్ యాక్సెస్ వంటి ఇతర విలువ-ఆధారిత సేవలను అందిస్తాయి
ప‌రిమితులు:
* అధిక వ్యయం, ఎక్కువ‌గా కొనుగోళ్లకు దారితీస్తుంది
* క్రెడిట్ కార్డు రుణాల‌ను స‌మ‌యానికి చెల్లించ‌క‌పోతే 40 శాతానికి పైగా ఛార్జీలు వ‌ర్తిస్తాయి.
* స‌మ‌యానికి చెల్లించ‌క‌పోతే మీ క్రెడిట్ స్కోర్‌ను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది
* క్రెడిట్ కార్డు సాధారణంగా వార్షిక రుసుములను కలిగి ఉంటుంది, ఇది అదనపు ఖర్చు అవుతుంది
* క్రెడిట్ కార్డులపై చెల్లింపులను ఆలస్యం చేయడం ఆలస్య రుసుమును ఆకర్షిస్తుంది
 క్రెడిట్ కార్డులను స‌రిగ్గా వినియోగించుకుంటే మంచి ప్ర‌యోజ‌నాలను అందిస్తాయి. కానీ, మీ బిల్లును సకాలంలో తిరిగి చెల్లించడంలో విఫలమైతే లేదా మీరు కనీస మొత్తాన్ని మాత్రమే చెల్లిస్తే, ఇది చెల్లించని మొత్తాన్ని వచ్చే నెలకు భారీ వడ్డీ రేటు వ‌ర్తిస్తుంది. క‌నీస చెల్లింపులు చేస్తూ రుణాన్ని కొన‌సాగిస్తే ఈ భారం మ‌రింత పెరుగుతుంది. స‌మ‌యానికి చెల్లించ‌క‌పోతే క్రెడిట్ స్కోర్ దెబ్బ‌తింటుంది.  ఇది కాకుండా, క్రెడిట్ కార్డు మోసం, దొంగతనం జ‌రిగే ప్రమాదం కూడా ఉంది. 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని