మీ టీకా ఖర్చు మేమే భరిస్తాం - reliance to bear corona vaccine cost of employee
close

Updated : 05/03/2021 13:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మీ టీకా ఖర్చు మేమే భరిస్తాం

ఉద్యోగులకు భరోసా ఇచ్చిన దిగ్గజ సంస్థలు

ముంబయి: తమ ఉద్యోగులకు అయ్యే టీకా ఖర్చును తామే భరిస్తామని దిగ్గజ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ వెల్లడించింది. అలాగే టీకా వేయించుకునేందుకు సిబ్బంది అంతా ముందుకు రావాలని కోరింది. ఈ మేరకు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్‌పర్సన్ నీతా అంబానీ ఉద్యోగులకు ఈమెయిల్ చేశారు.

‘మీతో సహా మీ కుటుంబ సభ్యుల(జీవిత భాగస్వామి, తల్లిదండ్రులు, అర్హులైన సంతానం) టీకా ఖర్చును రిలయన్స్ సంస్థ భరిస్తుంది. మీ భద్రత, క్షేమం మా బాధ్యత. మీ అందరి సహకారంతో ఈ మహమ్మారిని త్వరలో తరిమికొడతాం. అప్పటివరకూ జాగ్రత్తలు పాటించడంలో ఏ మాత్రం నిర్లక్ష్యం వద్దు. ఈ పోరాటంలో మనం తప్పకుండా గెలుస్తాం’ అని నీతా తన మెయిల్‌లో ఉద్యోగులకు భరోసా ఇచ్చారు.

రిలయన్స్‌తో సహా ఇప్పటికే ప్రముఖ ఐటీ సంస్థలు యాక్సెంచర్, ఇన్ఫోసిస్, క్యాప్‌జెమిని ఈ తరహా ప్రకటనే చేశాయి. ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల టీకా ఖర్చును భరిస్తామని వెల్లడించాయి. ఈ జాబితాలో ప్రముఖ సంస్థ విప్రో కూడా ఉంది.

ఇవీ చదవండి..

ఆదాయ పన్ను..చేయొద్దు పొరపాట్లు..

బగ్ గుర్తించి..రూ.36లక్షలు సాధించి..


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని