తుక్కు విధానం.. ప్రభుత్వ వాహనాలతోనే షురూ! - renewal of registration for 15yr old govt vehicles to stop
close

Published : 13/03/2021 20:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తుక్కు విధానం.. ప్రభుత్వ వాహనాలతోనే షురూ!

ప్రతిపాదనలు సిద్ధం చేసిన కేంద్రం

దిల్లీ: వాహన తుక్కు విధానం అమలును ప్రభుత్వ వాహనాలతోనే ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. కాలం చెల్లిన ప్రభుత్వ వాహనాల వినియోగాన్ని నిలిపివేసే దిశగా ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ మేరకు నిబంధనలు సవరించడంపై ప్రభుత్వ యంత్రాంగాలు తమ అభిప్రాయాలను తెలియజేయాలని కోరుతూ కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఒకవేళ ఈ ప్రతిపాదనలు ఖరారైతే.. ఇటు కేంద్రంతో పాటు రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వ శాఖలు, స్వంతంత్ర సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు, స్థానిక పాలనా యంత్రాంగంలో 15 సంవత్సరాలు పైబడిన వాహనాల రిజిస్ట్రేషన్‌ను పునరుద్ధరించుకునే అవకాశం ఉండదు. ఈ నిబంధనలు ఏప్రిల్‌ 1, 2022 నుంచి అమల్లోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు ప్రతిపాదనల్లో పేర్కొన్నారు.

స్వచ్ఛంద వాహన తుక్కు విధానాన్ని ఈసారి బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. దీని కింద.. 20 ఏళ్ల తర్వాత వ్యక్తిగత వాహనాలు; 15 ఏళ్ల తర్వాత వాణిజ్య వాహనాలకు సామర్థ్య పరీక్షలు నిర్వహిస్తారు. ఈ విధానం వల్ల ఇంధన సామర్థ్యం మెరుగు పడటంతో పాటు పర్యావరణహిత వాహనాలకు ప్రోత్సాహం లభిస్తుందని సీతారామన్‌ అన్నారు.

ఇవీ చదవండి..

టాటా కమ్యూనికేషన్స్‌లో ప్రభుత్వ వాటా విక్రయం!

ఇండో-పసిఫిక్‌కు భారత్‌ ఓ భరోసా!


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని