డిజిటల్‌ రుణాలపై ఆర్‌బీఐ కీలక నిర్ణయం - reserve bank of india forms group to evaluate digital lending
close

Updated : 13/01/2021 19:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

డిజిటల్‌ రుణాలపై ఆర్‌బీఐ కీలక నిర్ణయం

న్యూదిల్లీ: ఇటీవల కాలంలో ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న డిజిటల్‌ రుణాల దారుణాలను నివారించడానికి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) రంగంలోకి దిగింది. దీనిపై అధ్యయనం చేసేందుకు వర్కింగ్‌ గ్రూప్‌ను ఏర్పాటు చేసింది. రుణ యాప్‌లు, ఇతర డిజిటల్‌ రుణాలను ఈ  గ్రూప్‌ పరిశీలిస్తుంది. అంతేకాకుండా, డిజిటల్‌ రుణాల లోటుపాట్లపై కూడా అధ్యయనం చేస్తుంది.

‘‘ఆర్థికరంగంలో వివిధ డిజిటల్‌ పద్ధతుల ద్వారా అభివృద్ధిని వేగవంతం చేయడమనేది స్వాగతించదగినది. దీని వల్ల ప్రయోజనాలు ఉన్నట్లే కొన్ని ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి. దీన్ని సమన్వయం చేయాల్సిన అవసరం ఉంది. డేటా భద్రత, ప్రైవసీ, విశ్వసనీయత, వినియోగదారుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి. అందుకు తగిన విధంగా నియమ, నిబంధనలు తయారు చేయాలి’ అని ఆర్‌బీఐ ఒక ప్రకటనలో తెలిపింది.

ఇటీవల కాలంలో డిజిటల్‌ రుణాలను ఇచ్చే వేదికలు/ మొబైల్‌ యాప్స్‌ వాడకం వల్ల అనేక సమస్యలు ఏర్పడుతున్నాయని ఆర్‌బీఐ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఇలాంటి చర్యలను నివారించేందుకు వర్కింగ్‌ గ్రూప్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ వర్కింగ్‌ గ్రూప్‌ డిజిటల్‌ రుణాల లోటుపాట్లను అధ్యయనం చేస్తుందని తెలిపింది.

గూగుల్‌ ప్లే స్టోర్‌ నిబంధనలను ఉల్లంఘిస్తూ 10కి పైగా డిజిటల్‌ యాప్‌లు రుణాలను మంజూరు చేస్తున్నాయి. వీటి ద్వారా రుణాలు పొంది, వడ్డీలు కట్టలేక పలువురు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆర్‌బీఐ వర్కింగ్‌ గ్రూప్‌ను ఏర్పాటు చేయడం గమనార్హం.మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని