మీ పెట్టుబ‌డుల‌పై ఎంత రాబ‌డి వ‌స్తుంది? - return on your investments
close

Published : 25/12/2020 16:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మీ పెట్టుబ‌డుల‌పై ఎంత రాబ‌డి వ‌స్తుంది?

ప్రతి వ్యక్తి లక్ష్యాలు, ఆదాయం, ఖర్చులు, పెట్టుబడులు వేరువేరుగా ఉంటాయి.

ఆర్ధిక ఆస్తుల (financial assets) పోర్ట్ ఫోలియో లో అన్ని రకాల పెట్టుబడుల ఉండటం మంచిది. ప్రతి ఆర్ధిక ఆస్తులకు కొన్ని ప్రత్యేక లక్షణాలతోపాటు, అనుకూలతలు, ప్రతికూలతలు వుంటాయి . కేవలం ఈక్విటీలలో అధిక మోతంలో ఉన్నట్లయితే మితిమీరిన నష్టం రావచ్చు , అలాగే సంప్రదాయ పెట్టుబడులైన ఫిక్సెడ్ డిపాజిట్ వంటి వాటిలో అధిక రాబడి లేక తగిన నిధి సమకూరదు . అందువలన పోర్ట్ ఫోలియో లో అన్నీ కలబోతగా ఉండాలి. ఇదికొంచెం కష్టమైన పని.

సమయానుకూలంగా సమీక్ష చేసుకోవాలి…
మదుపరుని ఆర్ధిక లక్ష్యం, కాలపరిమితి , రిస్క్ తీసుకోగల సామర్ధ్యం, పెట్టుబడి ఫై రాబడి, లాక్ ఇన్ పీరియడ్, పన్ను వర్తింపు వంటి విషయాలను పరిగణించి పెట్టుబడి చేయాలి. అలాగే మార్కెట్ లో వచ్చే హెచ్చుతగ్గుల ప్రభావం తమ పెట్టుబడిఫై ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవాలి. ప్రతి వ్యక్తి లక్ష్యాలు, ఆదాయం, ఖర్చులు, పెట్టుబడులు వేరువేరుగా ఉంటాయి.

వైవిధ్యమైన పోర్ట్ ఫోలియో ఉండటం వలన , వివిధ మార్కెట్ పరిస్థితులలో , ఏదేని కారణం వలన ఒక పధకంలో నష్టం వాటిల్లితే, మరొక పధకంలో వచ్చే లాభంతో , నష్టాన్ని తగ్గించుకోవచ్చు. అందుచేత మీ నష్ట సామర్ధ్యానికి తగినట్లు, తగిన రాబడినిచ్చే పెట్టుబడులను మీ పోర్ట్ ఫోలియో లో ఉండాలి .

పోర్ట్ ఫోలియో లో ఈక్విటీ, లిక్విడ్ ఫండ్స్, బంగారం, ఫిక్సెడ్ డిపాజిట్ వంటివి ఉండేటట్లు చూసుకోవచ్చు. తరచూ పోర్ట్‌ఫోలియో ను సమీక్ష చేయడం వలన లక్ష్యానికి తగినట్లు పెట్టుబడులతో తగిన మార్పులను చేయవచ్చు. అయితే అతిగా మార్పులు చేయడం కూడా మంచిది కాదు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని