close

Published : 13/01/2021 16:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌‌ మెటియోర్‌ ధర పెంపు

ఇంటర్నెట్‌డెస్క్‌: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ మెటియోర్‌ 350 ధరను పెంచారు. ఈ మోటర్‌ సైకిల్‌ను నవంబర్‌లో మార్కెట్లోకి విడుదల చేశారు. ఆ తర్వాత కొన్ని నెలలకే ధరలు పెంచడం విశేషం. ఈ బైక్‌ మోడల్స్‌ ఫైర్‌బాల్‌, స్టెల్లర్‌, సూపర్‌ నోవా రకాల ధరలు పెరిగాయి. ఈ పెంపు రూ.2,927, రూ.3,010, రూ.3,146గా ఉండనుంది.  కొత్త ధరల ప్రకారం ఫైర్‌బాల్‌  రూ.1,78,744, స్టెల్లర్‌ రూ. 1,84,377, సూపర్‌నోవా రూ.1,93,656గా నిర్ణయించారు. ఈ బైక్‌ను పూర్తిగా 350 సీసీ ప్లాట్‌ఫామ్‌పై నిర్మించారు. 

ఈ బైకులో పూర్తిగా కొత్త ఇంజిన్‌, ఛాసిస్‌ అమర్చారు. ఇది 6,100 ఆర్‌పీఎం వద్ద  20.2 బీహెచ్‌పీ శక్తి, 4,000 ఆర్‌పీఎం వద్ద 27ఎన్‌ఎం టార్క్‌ను విడుదల చేస్తుంది. థండర్‌బోల్ట్‌ బైకుతో పోల్చుకుంటే ఇది ఆరుకిలోల బరువు తక్కువ. దీని బరువు 191 కిలోలు ఉంటుంది. ఈ బైకులో ప్లాస్టిక్‌ ఎక్కువగా వాడటంతో బరువు తగ్గింది.  కంపెనీ దేశీయ మార్కెట్‌ డిసెంబర్‌ నాటికి 35శాతం వృద్ధి సాధించింది. ఆ నెలలో మొత్తం 65,492 మోటార్‌ సైకిళ్లను విక్రయించింది. గతేడాది ఇదే నెలలో 48,489 మాత్రమే విక్రయించింది.

ఇవీ చదవండి

ట్రంప్‌ తీరుతో రిపబ్లికన్‌ పార్టీలో చీలికలు!

బ్రెజిల్‌కు ‘కొవాగ్జిన్‌’ టీకా

 

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని