close
Array ( ) 1

తాజా వార్తలు

భయం ఖరీదు: 5 నిమిషాలకు 4లక్షల కోట్లు..!

మార్కెట్లను కరోనా కమ్మేసింది..

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం: దేశీయ స్టాక్‌ మార్కెట్లలో నేడు తొలి గంటలో దాదాపు రూ.4లక్షల కోట్ల మేరకు మదుపరుల సంపద ఆవిరైపోయింది. కరోనా వైరస్‌ ప్రపంచ వ్యాప్తంగా వేగంగా ప్రబలుతోందనే భయాలు మార్కెట్లను వణికిస్తున్నాయి. నిన్న పవిత్ర మక్కాకు రాకపోకలను నిలిపివేస్తూ సౌదీ అరేబియా నిర్ణయించడం.. యూరప్‌ దేశాలు దాదాపు పర్యవేక్షణలో ఉండటంతో ఈ భయాలు మరింతగా పెరిగిపోయాయి. గత ఐదు సెషన్లలో నష్టాల్లో కొనసాగిన మార్కెట్లు ఆరో సెషన్‌లో ఒక్కసారిగా కుదేలైపోయాయి. ఈ వారం  చివర్లో మార్కెట్లకు భారీషాక్‌ తగిలినట్లైంది. 2008 తర్వాత మార్కెట్లు ఇంతగా భయపడిన సందర్భం ఇదే కావడం గమనార్హం. ముఖ్యంగా వైరస్‌ కారణంగా ప్రపంచ సప్లై చెయిన్‌పై వైరస్‌ ప్రభావం స్పష్టంగా పడటం మొదలైంది. చైనా ఎగుమతులు తగ్గి  ఫలితం ఇప్పుడు మార్కెట్లపై కనిపిస్తోంది. 

> ముఖ్యంగా టీసీఎస్‌,  రిలయన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఇన్ఫోసిస్‌ షేర్లు 2.5శాతం  నుంచి 3.5శాతం మధ్యలో కుంగాయి. బజాజ్‌ ఫైనాన్స్‌, టెక్‌ మహీంద్రా, టాటా స్టీల్‌ కూడా 4 నుంచి 5శాతం పడిపోయాయి. 

> భారత్‌ వీఐఎక్స్‌ ఇండెక్స్‌లో భారత్‌ 15 శాతం వృద్ధి సాధించడం కూడా  భయపెట్టింది. ఇది మదుపరుల్లో ఆందోళనను రెట్టింపు చేసింది. 

> ఈ రోజు ప్రభుత్వం అభివృద్ధి అంకెలను ప్రకటించనుండటం కూడా మార్కెట్లలో భయాలను నింపింది. జీడీపీ 4.7శాతం  వరకు ఉండొచ్చని భావిస్తున్నారు. గత త్రైమాసికంతో పోలిస్తే ఇది ఎక్కువ. ఒక వేళ గతం కంటే తగ్గితే కనుక నష్టాలు కొనసాగే అవకాశం ఉంది.  దేశీయ మార్కెట్లు అంతర్జాతీయ మార్కెట్లపై కరోనా ప్రభావాన్ని జాగ్రత్తగా గమనిస్తున్నాయి. 

> మార్కెట్లలోని మిడ్‌క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ సూచీల్లో అమ్మకాల ఒత్తిడి బాగా కనబడుతోంది. ఈ సూచీలు దాదాపు 2.5శాతం కుంగాయి. 

>  రాత్రి వాల్‌స్ట్రీట్‌ భారీగా పతనం కావడం ఆసియా మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపింది. జపాన్‌ సూచీలు 3.5శాతం, చైనా మార్కెట్లు 2.5శాతం విలువ కోల్పోయాయి. 

> నిన్న రాత్రి అమెరికాలోని డొజోన్స్‌ సూచీ చరిత్రలోనే అతిపెద్ద ఒక్కరోజు పతనాన్ని చవిచూసింది. దాదాపు 1200 పాయింట్లను కోల్పోయింది. ఫిబ్రవరి 19 తర్వాత ఎస్‌అండ్‌పీ 500 కూడా 10శాతం విలువ కోల్పోయింది.

> అమెరికాలో కరోనా ప్రభావిత ప్రాంతాలకు వెళ్లని ఒక మహిళకు కూడా ఈ వైరస్‌ సోకడంతో కాలిఫోర్నియా రాష్ట్రంలో దాదాపు 8400 మందిని పర్యవేక్షణలో ఉంచారు. ఇలాంటి అంశాలు ప్రపంచ మార్కెట్ల గుండెల్లో రైళ్లను పరిగెత్తిస్తున్నాయి. 

> మరోపక్క ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్‌ ఇటీవల స్పందిస్తూ ‘మేము కీలక  నిర్ణయం తీసుకొనే సమయం ఆసన్నమైంది. ప్రపంచ దేశాలు ఇప్పుడు స్పందిస్తేనే త్వరగా వైరస్‌ను అరికట్ట వచ్చు. ప్రజలు అనారోగ్యం పాలుకాకుండా కాపడవచ్చు’ అని పేర్కొన్నారు. 

> అమెరికాకు చెందిన ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌ బీవోఎఫ్‌ఏ కూడా ప్రపంచ వృద్ధిరేటును ఇటీవల తగ్గించింది. అది కూడా ఆర్థిక సంక్షోభం నాటి స్థాయికి కోత విధించడం గమనార్హం. 
> కరోనా వైరస్‌ ప్రపంచ, అమెరికా ఆర్థిక మాంద్యానికి బీజంగా మారుతుందని మూడీస్‌ హెచ్చరించింది. 

> ఒక పక్క చైనాలో కొత్తగా కరోనా కేసులు నమోదు తగ్గుముఖం పడితే.. ప్రపంచ వ్యాప్తంగా పెరగడం ఆందోళనకరంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా నమోదైన కేసులు చైనాను దాటేశాయి. ఈ విపత్తు ఎదుర్కోవడానికి అన్ని దేశాలు సిద్ధంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించడం ఆందోళనకరంగా మారింది. వ్యాధిగ్రస్థుల సంఖ్య లక్షకు చేరువ కావడం మార్కెట్లలో భయాలను పెంచేసింది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.