SBI Car Loan: కారు ధరలో 90% వరకు రుణం - sbi is offering 90pc of car price as Loan
close

Updated : 17/08/2021 10:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

SBI Car Loan: కారు ధరలో 90% వరకు రుణం

పలు రాయితీలు కూడా: ఎస్‌బీఐ

ముంబయి: రిటైల్‌ ఖాతాదారులకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) ఆకర్షణీయ ఆఫర్లు ప్రకటించింది. కొత్తగా కారు కొనాలనుకునే వారికి ఆన్‌రోడ్‌ ధరపై 90% వరకు రుణం ఇస్తున్నట్లు వెల్లడించింది.  పరిశీలనా రుసుమును కూడా పూర్తిగా రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. కారు రుణం కోసం యోనో యాప్‌ ద్వారా దరఖాస్తు చేసుకుంటే, వడ్డీలో 25 బేసిస్‌ పాయింట్ల రాయితీతో 7.5% వార్షిక వడ్డీ పడుతుందని వివరించింది. బంగారు ఆభరణాల తనఖా ద్వారా రుణం కోసం యోనో యాప్‌ ద్వారా దరఖాస్తు చేసుకుంటే.. 75 బేసిస్‌ పాయింట్ల రాయితీతో 7.5 శాతానికి అప్పు లభిస్తుందని పేర్కొంది.  వ్యక్తిగత, పింఛను రుణాలు తీసుకునే వారికీ పరిశీలనా రుసుమును పూర్తిగా రద్దు చేస్తోంది. కొవిడ్‌పై పోరాడుతున్న ఆరోగ్య సంరక్షకులకు వ్యక్తిగత రుణాల్లో 50బేసిస్‌ పాయింట్ల వడ్డీ రాయితీ ఇస్తున్నామని, త్వరలోనే కారు, బంగారు రుణాలకూ ఇది వర్తిస్తుందని పేర్కొంది. పండగల వేళ కార్లు కొనాలనుకునే వారికి ఈ ఆఫర్ల ద్వారా ప్రయోజనం చేకూరుతుందని ఎస్‌బీఐ మేనేజింగ్‌ డైరెక్టర్‌ (రిటైల్‌, డిజిటల్‌ బ్యాంకింగ్‌) సీఎస్‌ శెట్టి పేర్కొన్నారు. ఆగస్టు 31 వరకు గృహరుణాలపై పరిశీలనా రుసుములను బ్యాంక్‌ రద్దు చేసింది.

ప్రత్యేక డిపాజిట్‌ పథకం: 75 ఏళ్ల స్వతంత్ర వేడుకలను పురస్కరించుకుని, ప్లాటినం టర్మ్‌ డిపాజిట్‌ పథకాన్ని ఎస్‌బీఐ ప్రవేశ పెట్టింది. 75 రోజులు, 75 వారాలు, 75 నెలల కాలానికి డిపాజిట్‌ చేసిన వారికి 75 బేసిస్‌ పాయింట్ల మేరకు అదనపు వడ్డీ చెల్లించనుంది. ఇది సెప్టెంబరు 14లోపు చేసే డిపాజిట్లకు వర్తించనుంది.


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని