NPS : 65 ఏళ్లు దాటినా ఎన్‌పీఎస్‌ ఖాతా తెరవొచ్చు! - senior-citizens-above-age-65-up-to-70-years-are-also-allowed-to-open-a-NPS-account
close

Updated : 21/09/2021 14:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

NPS : 65 ఏళ్లు దాటినా ఎన్‌పీఎస్‌ ఖాతా తెరవొచ్చు!

65 ఏళ్లు పైబ‌డిన సీనియ‌ర్ సిటిజ‌న్లు ఇపుడు ఎన్‌పీఎస్ ఖాతాను తెర‌వ‌వ‌చ్చు. 65 సంవ‌త్స‌రాల త‌ర్వాత ఎన్‌పీఎస్‌లో చేరాల‌నుకునే వారికి, ప‌న్నును ఆదా చేయ‌డం మాత్ర‌మే కాకుండా, ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన త‌ర్వాత పెన్ష‌న్‌కు అనుబంధంగా ఒక పెట్టుబ‌డిని ఏర్పాటు చేసుకోవ‌డ‌మే ల‌క్ష్యం. ఇంత‌కుముందు ఎన్‌పీఎస్ ఖాతాల‌ను మూసివేసిన చందాదారులు పెరిగిన వ‌య‌స్సు అర్హ‌త నిబంధ‌న‌ల ప్ర‌కారం కొత్త ఎన్‌పీఎస్ ఖాతాను తెర‌వ‌డానికి అనుమ‌తి ఉంది. ఇపుడు 65 ఏళ్లు పైబ‌డిన సీనియ‌ర్ సిటిజ‌న్లు 70 సంవ‌త్స‌రాల వ‌ర‌కు నేష‌న‌ల్ పెన్ష‌న్ సిస్ట‌మ్ (ఎన్‌పీఎస్‌) ఖాతాను తెర‌వ‌డానికి కూడా అనుమ‌తించారు. ఇంత‌కు ముందు, పెన్ష‌న్ ఫండ్ రెగ్యులేట‌రీ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్‌డీఏ) ఎన్‌పీఎస్ కింద చేరే గ‌రిష్ఠ వ‌య‌స్సును 60 సంవ‌త్స‌రాల నుండి 65 ఏళ్ల‌కు పెంచింది. ఇపుడు 65-70 సంవ‌త్స‌రాల మ‌ధ్య ఉన్న ఏ భార‌తీయ పౌరుడు, నివాసి, నాన్‌-రెసిడెంట్‌, ఓవ‌ర్సీస్ సిటిజ‌న్ ఆఫ్‌ ఇండియా కూడా ఎన్‌పీఎస్‌లో చేర‌వ‌చ్చు. వారి ఎన్‌పీఎస్ ఖాతాను 75 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు వ‌ర‌కు కొన‌సాగించ‌వ‌చ్చు.

18-70 సంవ‌త్స‌రాల మ‌ధ్య వ‌య‌స్సు ఉన్న ఎవ‌రైనా ఎన్‌పీఎస్ ఖాతాను తెర‌వ‌వ‌చ్చు. ఇంత‌కు ముందు ఎన్‌పీఎస్ ఖాతాల‌ను మూసివేసిన చందాదారులు పెరిగిన వ‌య‌స్సు అర్హ‌త నిబంధ‌న‌ల ప్ర‌కారం కొత్త ఎన్‌పీఎస్ ఖాతాను తెర‌వ‌డానికి అనుమ‌తిస్తారు. ప్ర‌వేశ వ‌య‌స్సుకి సంబంధించిన కొత్త నియ‌మాలు సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు ముఖ్యంగా ఖాతా తెరిచి, వారి ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాత పొదుపు చేయాల‌నుకునే వారికి ప్ర‌యోజ‌నం చేకూరుస్తాయి. ఎన్‌పీఎస్‌లో పెట్టుబ‌డి పెట్ట‌డం ద్వారా, వారు ఇపుడు వారి జీవిత‌కాలం వ‌ర‌కు సాధార‌ణ పెన్ష‌న్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. ఎన్‌పీఎస్‌లో పెట్టుబ‌డి పెట్టే మొత్తం కూడా ప‌న్ను ప్ర‌యోజ‌నాల‌తో వ‌స్తుంది. ప‌న్నును ఆదా చేయ‌డానికి సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు స‌హాయ‌ప‌డుతుంది.

ప‌ద‌వీ విర‌మ‌ణ స‌మ‌యంలో కూడా, ఆయుర్దాయం (జీవిత కాలం), ద్ర‌వ్యోల్బ‌ణాన్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని ఈక్విటీల‌లో డ‌బ్బు కేటాయించాలి. ప‌ద‌వీ విర‌మ‌ణ స‌మ‌యంలో ద్ర‌వ్యోల్బ‌ణాన్ని నిర్వ‌హించ‌డానికి ప్ర‌భుత్వ సెక్యూరిటీలు, కార్పొరేట్ బాండ్ల వంటి ఈక్విటీ ఎంపిక‌ల మ‌ధ్య నిధుల‌ను కేటాయించే అవ‌కాశాన్ని ఎన్‌పీఎస్ మీకు అందిస్తుంది. 65 ఏళ్లు దాటిన ఎన్‌పీఎస్‌లో చేరిన‌వారు, ఆటో, యాక్టివ్ ఛాయిస్ కింద వ‌రుస‌గా గ‌రిష్ఠంగా 15%, 50% ఈక్విటీ ఎక్స్‌పోజ‌ర్‌తో పీఎఫ్ (పెన్ష‌న్ ఫండ్‌), అసెట్ కేటాయింపుల‌ను ఎంచుకోవ‌చ్చు.

65 ఏళ్లు దాటి ఎన్‌పీఎస్‌లో చేరిన చందాదారుల నిష్క్ర‌మ‌ణ ప‌రిస్థితులు ఈ విధంగా ఉంటాయి..

సాధార‌ణ నిష్క్ర‌మ‌ణ 3 సంవ‌త్స‌రాల త‌ర్వాత ఉంటుంది. ఎవ‌రైనా 65 సంవ‌త్స‌రాల త‌ర్వాత ఎన్‌పీఎస్‌లో చేరితే, క‌నీస లాక్‌-ఇన్ వ్య‌వ‌ధి 3 సంవ‌త్స‌రాలు. మొత్తం పెట్టుబ‌డిని ఉప‌సంహ‌రించుకోవ‌డం అనుమ‌తించ‌రు. చందాదారుడు కేవ‌లం 60% వ‌ర‌కు మాత్ర‌మే ప‌న్ను ర‌హిత ఉప‌సంహ‌ర‌ణ చేయ‌వ‌చ్చు. మిగ‌తా 40% పెన్ష‌న్ లేదా యాన్యుటీని జీవిత బీమా కంపెనీ చెల్లిస్తుంది. పెట్టుబ‌డి రూ. 5 ల‌క్ష‌ల‌కు స‌మానం లేదా అంత‌కంటే త‌క్కువ ఉంటే, చందాదారుడు పెన్ష‌న్ సంప‌ద‌ను మొత్తం ఉప‌సంహ‌రించుకోవ‌చ్చు. ఆ సంద‌ర్భంలో ఉప‌సంహ‌ర‌ణ మొత్తంలో 60% ప‌న్నుర‌హితంగా ప‌రిగ‌ణిస్తారు. మిగ‌తా 40% ప‌న్ను ప‌రిధిలోకి వ‌స్తుంది.

3 సంవ‌త్స‌రాలు పూర్తి కాక‌ముందే నిష్క్ర‌మించ‌డం ముంద‌స్తు ఉప‌సంహ‌ర‌ణ‌గా ప‌రిగ‌ణిస్తారు. ఒక‌వేళ ఎవ‌రైనా 65 ఏళ్ల త‌ర్వాత ఎన్‌పీఎస్‌లో చేరినా 3 సంవ‌త్స‌రాల ముందు విత్‌డ్రా చేయాల‌నుకుంటే.. 20% వ‌ర‌కు ప‌న్ను ర‌హిత ఉప‌సంహ‌ర‌ణ మాత్ర‌మే అనుమ‌తిస్తారు. మిగ‌తా మొత్తం జీవిత‌కాలం పెన్ష‌న్‌గా ఉంటుంది.

ఎన్‌పీఎస్ చందాదారుల‌కు ప‌న్ను ప్ర‌యోజ‌నాలు కూడా ఉన్నాయి. 80 సీసీడీ (1) కింద ఒక ఆర్థిక సంవ‌త్స‌రానికి రూ. 1.5 ల‌క్ష‌ల ప‌రిమితి వ‌ర‌కు మిన‌హాయింపు పొంద‌డానికి అర్హ‌త పొంద‌డ‌మే కాకుండా, సెక్ష‌న్ 80 సీసీడీ (1బీ) కింద ఆర్థిక సంవ‌త్స‌రం రూ.50 వేల వ‌ర‌కు అద‌న‌పు ప‌న్ను ప్ర‌యోజ‌నంతో వ‌స్తుంది. 65 సంవ‌త్స‌రాల త‌ర్వాత ఎన్‌పీఎస్‌లో చేరిన వారికి, యువ‌త‌తో పోలిస్తే మెరుగైన యాన్యుటీ రేట్ల ప‌రంగా ప్ర‌యోజ‌నం ఉంటుంది. 55 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు ఉన్న‌వారికి యాన్యుటీ రేట్ల కంటే 65 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు ఉన్న‌వారికి యాన్యుటీ రేట్లు ఉత్త‌మం. 65 ఏళ్లు దాటిని త‌ర్వాత ఎన్‌పీఎస్‌లో చేరాల‌నుకునే వారి ల‌క్ష్యం కేవ‌లం పన్ను ఆదా చేయ‌డ‌మే కాదు. ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన‌పుడు పెన్ష‌న్‌కు అనుబంధంగా మూల‌ధ‌నాన్ని ఏర్పాటు చేసుకోవ‌డం కూడా.n


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని