సెన్సెక్స్‌@52,000.. నిఫ్టీ@15,300 - sensex at 52k nifty 15300
close

Published : 15/02/2021 12:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సెన్సెక్స్‌@52,000.. నిఫ్టీ@15,300

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సోమవారం కొత్త గరిష్ఠాలను తాకాయి. తొలిసారి సెన్సెక్స్‌ 52వేల మార్క్‌ను దాటగా.. నిఫ్టీ 15,300 పైన ట్రేడవుతోంది. ఉదయం 374 పాయింట్ల లాభంతో 51,918 వద్ద శుభారంభం చేసిన సెన్సెక్స్‌ ఓ దశలో 52,134 వద్ద గరిష్ఠాన్ని తాకింది. నిఫ్టీ సైతం అదే ట్రెండ్‌ను కొనసాగిస్తూ.. 15,318 వద్ద జీవనకాల గరిష్ఠాన్ని నమోదు చేసింది. ఉదయం 11:51 గంటల సమయంలో సెన్సెక్స్‌ 554 పాయింట్లు లాభపడి 52,091 వద్ద, నిఫ్టీ 142 పాయింట్ల లాభంతో 15,306 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.72.72 వద్ద కొనసాగుతోంది. ఆసియా మార్కెట్లలో జపాన్‌ నిక్కీ 1.3 శాతం లాభాల్లో కొనసాగుతోంది. ఆస్ట్రేలియా మార్కెట్లు ఒకశాతం మేర లాభపడ్డాయి. మొత్తంగా ఆసియా మార్కెట్లన్నీ సానుకూలంగానే కదలాడుతున్నాయి. కీలక కంపెనీ షేర్లు దూసుకెళుతుండడం సూచీలకు దన్నుగా నిలుస్తోంది. ఎఫ్‌ఐఐ పెట్టుబడుల వెల్లువ, రిటైల్‌ ద్రవ్యోల్బణం కనిష్ఠానికి చేరడం, పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధిలోకి రావడం వంటి సానుకూల సంకేతాలు మదుపర్ల సెంటిమెంటును పెంచాయి. నూతన సంవత్సరం సందర్భంగా చైనా, తైవాన్‌ ఎక్స్ఛేంజీలు గురువారం వరకు; ప్రెసిడెంట్స్‌ డే సందర్భంగా అమెరికా మార్కెట్లు నేడు పనిచేయవు.

ఉదయం మిశ్రమంగా కదలాడిన వివిధ రంగాల సూచీలు.. క్రమంగా కోలుకొని దాదాపు అన్నీ లాభాల్లోకి జారుకున్నాయి. స్థిరాస్తి రంగ సూచీ అత్యధికంగా 2.15 శాతం మేర లాభపడగా.. బ్యాంకింగ్‌ రంగం 1.97 శాతం, ఆర్థిక 1.90 శాతం, టెలికాం 1.59 శాతం లాభపడ్డాయి. బజాజ్‌ ఫినాన్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌, హీరోమోటోకార్ప్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ షేర్లు నష్టాల్ని చవిచూస్తున్నాయి.

ఇవీ చదవండి...

ఈ ఏడాది వేతనాలు ఎంత పెరగొచ్చంటే..

వరుసగా ఏడోరోజు పెరిగిన ఇంధన ధరలు


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని