ముంబయి: గురువారం భారీ లాభాలతో చరిత్ర సృష్టించిన దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు కాస్త నెమ్మదించాయి. ఆసియా మార్కెట్లు నేలచూపులు చూడడం, నిన్నటి భారీ లాభాల నేపథ్యంలో మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడం వంటి పరిణామాలు సూచీలను ప్రభావితం చేస్తున్నాయి. శుక్రవారం ఉదయం 9:34 గంటల సమయంలో సెన్సెక్స్ 211 పాయింట్లు నష్టపోయి 49,388 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 58 పాయింట్ల నష్టంతో 14,531 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.72.98 వద్ద కొనసాగుతోంది. ఆసియా మార్కెట్లు ఈ వారం భారీ లాభాల్లో పయనించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడ కూడా మదుపర్లు లాభాల స్వీకరణ దిశగా సాగారు. ఈ నేపథ్యంలోనే ఆసియా మార్కెట్లు నష్టాల బాట పట్టాయి.
టాటా మోటార్స్, బజాజ్ ఆటో, హీరో మోటోకార్ప్, ఐషర్ మోటార్స్, శ్రీ సిమెంట్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, హిందాల్కో ఇండస్ట్రీస్, టెక్ మహీంద్రా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ షేర్లు నష్టాల్ని చవిచూస్తున్నాయి.
ఇవీ చదవండి...
50000 అద్భుతాన్ని అందుకుని.. వెనక్కి
మరిన్ని
మీ ప్రశ్న
సిరి జవాబులు
-
Q. హాయ్ సిరి, నా పేరు శ్రీధర్. నేను రూ. 50 లక్షలకు టర్మ్ పాలసీ తీసుకుందాం అని అనుకుంటున్నాను , మంచి టర్మ్ పాలసీ చెప్పగలరు.
-
Q. నా పేరు ప్రదీప్, హైదరాబాద్ లో నివసిస్తాను. నేను హెచ్డీఎఫ్సీ లైఫ్ ప్రో గ్రోత్ ప్లస్ డెత్ బెనిఫిట్ ప్లాన్ లో గత 3 ఏళ్ళు గా సంవత్సరానికి రూ. 30,000 మదుపు చేస్తున్నాను. హెచ్డీఎఫ్సీ వారు నాకు ఈ పధకం 5 ఏళ్ళు మాత్రమే అని చెప్పారు, అయితే ఇప్పుడు పాలసీ లో చుస్తే 15 ఏళ్ళు అని చూపిస్తోంది. ఈ విషయమై ఆరా తీస్తే కనీస పరిమితి 5 ఏళ్ళు , ఆ తరువాత దీన్ని కొనసాగించాలా వద్ద అనే నిర్ణయం మనం తీసుకోవచ్చని తెలిసింది. ఇప్పుడు నేనేం చేయాలి? దీన్ని కొనసాగించాలా వద్దా? ఇంకా ఎందులో అయితే బాగుంటుంది?
-
Q. సర్ నేను ఏటీఎంలో విత్డ్రా చేసేందుకు ప్రయత్నించినప్పుడు నగదు రాలేదు కాని ఖాతా నుంచి డెబిట్ అయింది. బ్యాంకులో ఫిర్యాదు చేసి 15 రోజులు అయింది. కానీ ఇప్పటి వరకు నగదు తిరిగి క్రెడిట్ కాలేదు. బ్యాంకు వారు ఫిర్యాదుకు సరిగా స్పందించడంలేదు. ఇప్పుడు ఏం చేయాలి?