నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు - sensex down by 300 pts
close

Published : 27/01/2021 09:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. బుధవారం ఉదయం 9:42 గంటల సమయంలో సెన్సెక్స్‌ 264 పాయింట్లు నష్టపోయి 48,065 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 86 పాయింట్ల నష్టంతో 14,153 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.72.90 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లు నష్టాల్లో పయనిస్తుండడం సూచీల సెంటిమెంటును దెబ్బతీసింది. మరోవైపు టీకా అందుబాటులోకి రావడం, ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజం వంటి సానుకూల సంకేతాలతో ఇటీవల భారీ లాభాలను మూటగట్టుకున్న మార్కెట్లు స్థరీకరణ దిశగా సాగుతుండడం కూడా సూచీలు దిగజారడానికి కారణంగా తెలుస్తోంది.

విప్రో లిమిటెడ్‌, టెక్ మహీంద్రా, మహీంద్రా అండ్‌ మహీంద్రా, ఎల్‌ అండ్‌ టీ, ఐటీసీ లిమిటెడ్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. హిందాల్కో ఇండస్ట్రీస్‌, టాటా మోటార్స్‌ లిమిటెడ్‌, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌, ఐషర్‌ మోటార్స్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ షేర్లు నష్టాల్ని చవిచూస్తున్నాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని