మార్కెట్ల జోరుకు కళ్లెం! - sensex down by 90 pts
close

Published : 05/01/2021 09:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మార్కెట్ల జోరుకు కళ్లెం!

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీల జోరుకు మంగళవారం బ్రేక్‌ పడింది. ఉదయం 9:36 గంటల సమయంలో సెన్సెక్స్‌ 90 పాయింట్లు నష్టపోయి 48,086 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 29 పాయింట్ల నష్టంతో 14,104 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.72.89 వద్ద కొనసాగుతోంది. ఆసియా మార్కెట్లు నష్టాలు చవిచూస్తున్నాయి. నిన్నటి భారీ లాభాల నేపథ్యంలో మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు బ్యాంకింగ్‌, ఆర్థిక సేవలు, ఇంధన, వాహన రంగాలు నష్టాల్లో పయనిస్తున్నాయి. ఐటీ, ఔషధ రంగ షేర్లు రాణిస్తూ సూచీల పతనాన్ని కట్టడి చేస్తున్నాయి. ఇక ఇంగ్లండ్‌లో మళ్లీ పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ విధింపు, జపాన్‌లో బిజినెస్‌ హవర్స్‌ తగ్గింపు యోచన మదుపర్లపై ప్రభావం చూపుతున్నాయి. 

యాక్సిస్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, టీసీఎస్‌, హెచ్‌యూఎల్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. టాటా మోటార్స్‌, ఓఎన్‌జీసీ, హిందాల్కో ఇండస్ట్రీస్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, జేఎస్‌డబ్ల్యూ షేర్లు నష్టాల్ని చవిచూస్తున్నాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని