నష్టాలతో ముగిసిన మార్కెట్లు - sensex falls 81 points
close

Updated : 07/01/2021 16:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నష్టాలతో ముగిసిన మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు స్వల్ప నష్టాలతో ముగిశాయి. ఐటీ, ఎఫ్‌ఎంసీజీ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోవడంతో వరుసగా రెండో రోజూ నష్టాలను చవిచూశాయి. దీంతో నిఫ్టీ 14,150 దిగువన ముగిసింది. డాలరుతో రూపాయి మారకం 20 పైసలు క్షీణించి 73.31 వద్ద ముగిసింది.

ఉదయం 48,462 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్‌ మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో ఇంట్రాడే గరిష్ఠాలను కోల్పోయి క్రమంగా నష్టాల్లోకి జారుకుంది. చివరికి 80.74 పాయింట్ల నష్టంతో 48,093 వద్ద ముగిసింది. నిఫ్టీ 8.90 పాయింట్ల నష్టంతో 14,137.35 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీలో నెస్లే ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ ఇన్సూరెన్స్‌, హిందుస్థాన్‌ యూనీలీవర్‌, దివీస్‌ ల్యాబ్స్‌, టైటాన్‌ కంపెనీ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. టాటా స్టీల్‌, హిందాల్కో ఇండస్ట్రీస్‌, భారతీ ఎయిర్‌టెల్‌, అదానీ పోర్ట్స్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు రాణించాయి.

ఇవీ చదవండి..
పేటీఎం ద్వారా 2 నిమిషాల్లో ప‌ర్సన‌ల్ లోన్‌!
పొదుపు ఖాతాపై వ‌డ్డీ రేట్లు పెంచిన ఐడీఎఫ్‌సీ ఫ‌స్ట్ బ్యాంక్‌


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని