రికార్డుల నుంచి నష్టాల్లోకి.. - sensex falls after hitting 50k mark
close

Published : 21/01/2021 16:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రికార్డుల నుంచి నష్టాల్లోకి..

ముంబయి: కొనుగోళ్ల అండతో కొత్త గరిష్ఠాలను తాకిన దేశీయ స్టాక్‌మార్కెట్లు.. ఆ రికార్డులను నిలబెట్టుకోలేకపోయాయి. చివరి గంటల్లో మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో నష్టాలను చవిచూశాయి. దీంతో బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ సెన్సెక్స్‌ 50వేల దిగువకు పడిపోగా.. నిఫ్టీ 14,600 మార్క్‌ను కోల్పోయింది. 

అమెరికాలో కొలువుదీరిన బైడెన్‌ ప్రభుత్వం భారీ ఉద్దీపన ప్యాకేజీని ఆవిష్కరించే అవకాశాలున్నాయన్న వార్తలు అంతర్జాతీయ మార్కెట్లలో జోష్‌ నింపాయి. దీనికి తోడు విదేశీ పెట్టుబడులు కూడా పెరగడంతో ఈ ఉదయం దేశీయ సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్‌ ఆరంభమైన కాసేపటికే సెన్సెక్స్‌ చరిత్రలో తొలిసారి 50వేల మైలురాయిని దాటింది. ఇంట్రాడేలో 50,184 వద్ద సరికొత్త జీవనకాల గరిష్ఠ స్థాయిలో ట్రేడ్‌ అయ్యింది. నిఫ్టీ కూడా 14,753వద్ద కొత్త రికార్డును తాకింది. 

అయితే ఈ రికార్డులు ఎంతోసేపు నిలువలేదు. మధ్యాహ్నం సెషన్‌ తర్వాత మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు. ఫలితంగా కీలక రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో సూచీలు ఆరంభ లాభాలను కోల్పోయి నష్టాల బాట పట్టాయి. నేటి ట్రేడింగ్‌ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 167 పాయింట్లు దిగజారి 49,624.76 వద్ద, నిఫ్టీ 54 పాయింట్ల నష్టంతో 14,590.35 వద్ద స్థిరపడ్డాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ ఐదు నెలల గరిష్టానికి చేరి 72.99గా ముగిసింది. టెలికాం రంగ షేర్లు 2.64శాతం, రియల్టీ 2.56శాతం, లోహ రంగ షేర్లు 2.41శాతం మేర కుంగాయి. 

ఇదీ చదవండి..

సెన్సెక్స్‌.. 50వేల ప్రస్థానం


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని