ఒడుదొడుకులు ఎదుర్కొన్నా లాభాల్లోనే - sensex gains 117 pts
close

Updated : 05/02/2021 16:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఒడుదొడుకులు ఎదుర్కొన్నా లాభాల్లోనే

ముంబయి: దేశీయ మార్కెట్లు శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో ఒడుదొడుకులు ఎదుర్కొన్నాయి. అయినా వరుసగా ఐదో రోజూ లాభాల్లోనే ముగిశాయి. ఆర్‌బీఐ కీలక వడ్డీ రేట్లు యథాతథంగా కొనసాగించడంతో రికార్డు స్థాయి లాభాల్లోకి వెళ్లిన సూచీలు సాధారణ లాభాలకు పరిమితమయ్యాయి. ప్రభుత్వ రంగ బ్యాంకు షేర్లు రాణించగా.. ఆటో, ఐటీ షేర్లు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయి. నిఫ్టీ 14,900 పాయింట్ల పైన ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 72.93గా ఉంది.

ఉదయం 50,907 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్‌ కాసేపటికే 51 వేల మార్కును అందుకుని రికార్డు సృష్టించింది. ఆర్‌బీఐ ప్రకటన అనంతరం కాసేపు నష్టాల్లోకి జారుకుని మళ్లీ కోలుకుంది. ఇలా రోజంతా ఒడుదొడుకులకు లోనవుతూ వచ్చింది. చివరికి 117.34 పాయింట్ల లాభంతో 50,731.63 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 28.60 పాయింట్ల లాభంతో 14,924.30 వద్ద స్థిరపడింది. నిఫ్టీలో ఎస్‌బీఐ (10%) షేరు అదరగొట్టింది. టాటా స్టీల్‌, దివీస్‌ ల్యాబ్స్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ షేర్లు సైతం రాణించాయి. యాక్సిస్‌ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, టాటా మోటార్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, యూపీఎల్‌ షేర్లు నష్టాలు చవిచూశాయి. పీఎస్‌యూ, ఫార్మా రంగాల షేర్లు లాభపడగా.. ఆటో, ఐటీ, ఇన్‌ఫ్రా షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.

ఇవీ చదవండి..

భారత్‌లో వెనక్కి తగ్గిన ఫైజర్!

ఫిక్స్‌డ్ డిపాజిట్ల వ‌డ్డీ రేట్లు - ఏ బ్యాంకు అధిక వడ్డీ ఇస్తుంది?


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని