బుల్‌ హ్యాట్రిక్‌.. సెన్సెక్స్‌ 50,000+ - sensex gains 450 pts
close

Updated : 03/02/2021 15:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బుల్‌ హ్యాట్రిక్‌.. సెన్సెక్స్‌ 50,000+

ముంబయి: దలాల్‌ స్ట్రీట్‌లో వరుసగా మూడో రోజూ బుల్‌ రంకెలేసింది. కేంద్ర బడ్జెట్‌ ఇచ్చిన ఉత్సాహానికి అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల పరిణామాలు తోడవ్వడంతో దేశీయ మార్కెట్లు మరోసారి భారీ లాభాల్లో ముగిశాయి. ముఖ్యంగా ఆటో, ఫార్మా, మెటల్‌ షేర్లు రాణించడంతో సెన్సెక్స్‌ మళ్లీ 50వేల మార్కును అందుకుంది. డాలరుతో రూపాయి మారకం విలువ 72.95గా ఉంది.

ఉదయం 49,952 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్‌ కొద్దిసేపు నష్టాల్లోకి జారుకుంది. ఆ తర్వాత తన జోరు చూపించింది. ఒకానొక దశలో 50,500 పాయింట్ల దాటి జీవన కాల గరిష్ఠాలను తాకిన సూచీ చివరికి 458.03 పాయింట్ల లాభంతో 50,255.75 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 142.10 పాయింట్లు లాభపడి 14,789.95 వద్ద స్థిరపడింది. నిఫ్టీలో ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌, దివీస్‌ ల్యాబ్స్‌, కోల్‌ ఇండియా, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ షేర్లు ప్రధానంగా రాణించాయి. శ్రీ సిమెంట్స్‌, యూపీఎల్‌, మారుతీ సుజుకీ ఇండియా, ఐటీసీ లిమిటెడ్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ షేర్లు స్వల్ప నష్టాలు చవిచూశాయి. ఎఫ్‌ఎంసీజీ మినహా మిగిలిన అన్ని రంగాల షేర్లు రాణించాయి.

ఇవీ చదవండి..
బడ్జెట్ 2021లో ప్రతిపాదించిన ఈపీఎఫ్‌ వడ్డీపై పన్ను అర్థం ఏమిటి?
అమెజాన్‌ సీఈవోగా తప్పుకోనున్న బెజోస్‌


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని