కొత్త గరిష్ఠాలకు సెన్సెక్స్‌ - sensex jumps 260 points to end at new lifetime high
close

Updated : 05/01/2021 16:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొత్త గరిష్ఠాలకు సెన్సెక్స్‌

ముంబయి: దేశీయ మార్కెట్లు మరో అరుదైన రికార్డు అందుకున్నాయి. వరుసగా పదో రోజూ సూచీలు లాభాల్లో దూసుకెళ్లాయి. సోమవారం సెన్సెక్స్‌ 48వేల మార్కును దాటగా, ఈరోజు మరింత ముందుకు వెళ్లింది. మంగళవారం నాటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 261 పాయింట్లు లాభపడి 48,437 వద్ద సరికొత్త జీవనకాల గరిష్ఠాన్ని తాకింది. నిఫ్టీ కూడా 66 పాయింట్ల లాభంతో 14,199 వద్ద ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.73.17 నమోదైంది.

ఉదయం స్టాక్‌మార్కెట్లు నష్టాలతో మొదలయ్యాయి. ఆరంభ ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 112 పాయింట్ల నష్టపోగా, నిఫ్టీ 38 పాయింట్లు కోల్పోయింది. నిన్నటి భారీ లాభాల నేపథ్యంలో మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు. మరోవైపు బ్యాంకింగ్‌, ఆర్థిక సేవలు, ఇంధన, వాహన రంగాల షేర్లు నష్టాలను చవి చూశాయి. ఇంగ్లండ్‌లో మళ్లీ పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ విధింపు, జపాన్‌లో బిజినెస్‌ అవర్స్‌ తగ్గింపు యోచన మదుపర్లపై ప్రభావం పడినట్లు నిపుణులు తెలిపారు. ఈ నేపథ్యంలో సెన్సెక్స్‌ 48వేల మార్కుకు కింద ట్రేడింగ్‌ అయింది. అయితే, చివరి సెషన్‌లో పెట్టుబడులు పెట్టేందుకు మదుపరులు ఆసక్తి చూపడంతో చివరకు 261 పాయింట్ల లాభంతో ముగిసింది.

మంగళవారం నాటి ట్రేడింగ్‌లో యాక్సిస్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, విప్రో తదితర షేర్లు లాభపడగా, ఓఎన్‌జీసీ, జేఎస్‌డబ్ల్యూ,బజాజ్‌ ఫైనాన్స్‌, టాటా స్టీల్‌, హిందాల్కో మొదలైన షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని