ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు - sensex nifty end flat amid high volatility
close

Published : 13/01/2021 15:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు

ముంబయి: ఆద్యంతం ఊగిసలాట మధ్య సాగిన దేశీయ మార్కెట్లు బుధవారం ఫ్లాట్‌గా ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 24 పాయింట్లు నష్టపోయి 49,492 వద్ద ముగియగా నిఫ్టీ 1.40 పాయింట్ల లాభంతో 14,564 వద్ద స్థిరపడింది.

ఉదయం స్టాక్‌మార్కెట్లు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. ఆరంభ ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 200 పాయింట్లు లాభపడి, తాజా జీవితకాల గరిష్ఠానికి 49,776 పాయింట్లకు చేరింది. విదేశీ మదుపరులు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపారు. అదే సమయంలో నిఫ్టీ కూడా 70 పాయింట్ల లాభంతో 14,634 పాయింట్లతో ట్రేడింగ్‌ను కొనసాగించింది. ఆ తర్వాత మదుపరులు నెమ్మదిగా లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో నష్టాలు మొదలయ్యాయి. ఒకానొక దశలో సెన్సెక్స్‌ 49,073 పాయింట్లకు పడిపోయింది. ఆ తర్వాత కోలుకున్నా, చివరకు 24 పాయింట్ల నష్టంతో ముగిసింది.

బుధవారం నాటి ట్రేడింగ్‌లో ఎం అండ్‌ ఎం, అదానీ పోర్ట్స్‌, ఎస్‌బీఐ, ఐవోసీ, ఎన్టీపీసీ తదితర షేర్లు లాభపడగా, హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్‌ ఫైనాన్స్‌, శ్రీ సిమెంట్స్‌, యూపీఎల్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని