close

Updated : 18/01/2021 09:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఊగిసలాట ధోరణిలో సూచీలు

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశీయ స్టాక్‌మార్కెట్లు మందకొడిగా ట్రేడవుతున్నాయి. సోమవారం ఉదయం 9.29 సమయంలో సెన్సెక్స్‌ 11 పాయింట్ల నష్టంతో 49,023 వద్ద, నిఫ్టీ 16 పాయింట్ల నష్టంతో 14,417 వద్ద కొనసాగుతున్నాయి. యూపీఎల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎస్‌బీఐ, హెచ్‌సీఎల్‌ టెక్‌, విప్రో లాభాల్లో ఉండగా.. హిందాల్కో, టాటాస్టీల్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, పవర్‌ గ్రిడ్‌ కార్ప్‌, కోల్‌ ఇండియా షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ లాభాల్లో కొనసాగుతోంది. ఈ బ్యాంక్‌ నికర లాభాల్లో 18శాతం వృద్ధి కనిపించడంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఉత్సాహం చూపుతున్నారు. మెట్రోపోలిస్‌ హెల్త్‌కేర్‌ షేర్లు 4శాతం లాభాల్లో దూసుకెళుతున్నాయి. ఈ కంపెనీ ‘డాక్టర్‌ గణేశన్‌ హైటెక్‌ డయాగ్నస్టిక్’‌ సెంటర్‌ను కొనుగోలు చేయడంతో వ్యాపార కార్యకలాపాలు విస్తరించనున్నాయి. నేడు మైండ్‌ట్రీ, ఇండియామార్ట్‌, ర్యాలీస్‌ ఇండియా సహా మరో 18 కంపెనీలు తమ ఫలితాలను ప్రకటించనున్నాయి. దీంతోపాటు నేటి నుంచి రైల్వే ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఐపీవో బిడ్లు కూడా స్వీకరించనున్నారు. 

ఇవీ చదవండి

నేటి నుంచి ఐఆర్‌ఎఫ్‌సీ ఐపీవో మొదలు

మార్కెట్లపై కరోనా ఒత్తిడి

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని