మార్కెట్‌ జోష్‌.. సెన్సెక్స్‌ 51,000+ - sensex nifty zooms to new life times
close

Updated : 08/02/2021 09:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మార్కెట్‌ జోష్‌.. సెన్సెక్స్‌ 51,000+

ముంబయి: దేశీయ మార్కెట్లలో రికార్డుల జోరు కొనసాగుతోంది. వరుసగా రెండో వారం సూచీల లాభాల పరుగు మొదలైంది. ఆర్థికవృద్ధి రికవరీపై ఆర్‌బీఐ చేసిన సానుకూల వ్యాఖ్యలతో సోమవారం నాటి ట్రేడింగ్‌ను మార్కెట్లు భారీ లాభాలతో మొదలుపెట్టాయి. సరికొత్త జీవనకాల గరిష్ఠ స్థాయిని తాకాయి. కొనుగోళ్ల అండతో 500 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడింగ్‌ను ఆరంభించిన సెన్సెక్స్‌ 51వేల మైలురాయిని దాటింది. నిఫ్టీ కూడా 15 వేల మార్క్‌ పైన ట్రేడ్‌ అవుతోంది. ఉదయం 9.45 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌ 541 పాయింట్లు ఎగబాకి 51,273 వద్ద, నిఫ్టీ 156 పాయింట్ల లాభంతో 15,081 వద్ద కొనసాగుతున్నాయి. నిఫ్టీ బ్యాంక్‌ 2శాతానికి పైగా లాభంలో ఉంది. ఆటో, బ్యాంకింగ్‌ షేర్లు రాణిస్తున్నాయి. బడ్జెట్‌ జోరుతో గతవారమంతా సూచీలు లాభాలను దక్కించుకున్న విషయం తెలిసిందే.

ఇవీ చదవండి..

పదవీ విరమణ నిధి పెంచుకోండిలా..

ముంబయి విమానాశ్రయంలో అదానీ ఎయిర్‌పోర్ట్స్‌కు వాటా


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని