ఇంటర్పెట్డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం ట్రేడింగ్‌ను నష్టాలతో మొదలుపెట్టాయి. ఉదయం 9.36 సమయంలో సెన్సెక్స్ 144 పాయింట్లు పతనమై 49,348 వద్ద, నిఫ్టీ 51 పాయింట్లు పతనమై 14,513 వద్ద ట్రేడవుతున్నాయి. ప్రభుత్వం తేజస్ విమానాల కొనుగోలుకు కేబినెట్ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నేడు హిందూస్థాన్ ఏరోనాటిక్స్ షేరు 7శాతానికి పైగా లాభపడింది. ఒక దశలో 12శాతానికిపైగా లాభపడింది.
క్విక్ హీల్ టెక్నాలజీస్, మజిస్కో, కేఎస్బీ, బజాజ్ ఎలక్ట్రానిక్స్ భారీ లాభాల్లో ఉన్నాయి. సెయిల్, జమ్ముకశ్మీర్ బ్యాంక్, జైన్ ఇరిగేషన్, విప్రో, జయప్రకాశ్ అసోసియేట్స్ భారీ నష్టాల్లో ఉన్నాయి. టెలికమ్, మెటల్, ఐటీ రంగాల సూచీలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఇన్ఫోసిస్ షేర్లు 4శాతం నష్టపోయింది. నిన్న కంపెనీ మంచి ఫలితాలను ప్రకటించడంతో లాభాల స్వీకరణ మొదలుపెట్టారు. ముఖ్యంగా ఐటీ కంపెనీల పనితీరు డిసెంబర్ త్రైమాసికంలో ఆశాజనకంగా ఉండకపోవచ్చనే అంచనాలతో ఈ రంగలోని షేర్లను విక్రయిస్తున్నారు. నేడు దెన్ నెట్వర్క్స్, హెచ్ఎఫ్సీఎల్, రిలయన్స్ ఇండస్ట్రీయల్ ఇన్ఫ్రా,టాటాస్టీల్ లాంగ్, వెబ్‌సోల్ ఎనర్జీ వంటి కంపెనీలు ఫలితాలను ప్రకటించనున్నాయి.
ఇవీ చదవండి
ప్రమరికా లైఫ్ ఎవరికి దక్కుతుందో?
భళా ఇన్ఫోసిస్
మరిన్ని
మీ ప్రశ్న
సిరి జవాబులు
-
Q. హాయ్ సిరి, నా పేరు శ్రీధర్. నేను రూ. 50 లక్షలకు టర్మ్ పాలసీ తీసుకుందాం అని అనుకుంటున్నాను , మంచి టర్మ్ పాలసీ చెప్పగలరు.
-
Q. నా పేరు ప్రదీప్, హైదరాబాద్ లో నివసిస్తాను. నేను హెచ్డీఎఫ్సీ లైఫ్ ప్రో గ్రోత్ ప్లస్ డెత్ బెనిఫిట్ ప్లాన్ లో గత 3 ఏళ్ళు గా సంవత్సరానికి రూ. 30,000 మదుపు చేస్తున్నాను. హెచ్డీఎఫ్సీ వారు నాకు ఈ పధకం 5 ఏళ్ళు మాత్రమే అని చెప్పారు, అయితే ఇప్పుడు పాలసీ లో చుస్తే 15 ఏళ్ళు అని చూపిస్తోంది. ఈ విషయమై ఆరా తీస్తే కనీస పరిమితి 5 ఏళ్ళు , ఆ తరువాత దీన్ని కొనసాగించాలా వద్ద అనే నిర్ణయం మనం తీసుకోవచ్చని తెలిసింది. ఇప్పుడు నేనేం చేయాలి? దీన్ని కొనసాగించాలా వద్దా? ఇంకా ఎందులో అయితే బాగుంటుంది?
-
Q. సర్ నేను ఏటీఎంలో విత్‌డ్రా చేసేందుకు ప్రయత్నించినప్పుడు నగదు రాలేదు కాని ఖాతా నుంచి డెబిట్ అయింది. బ్యాంకులో ఫిర్యాదు చేసి 15 రోజులు అయింది. కానీ ఇప్పటి వరకు నగదు తిరిగి క్రెడిట్ కాలేదు. బ్యాంకు వారు ఫిర్యాదుకు సరిగా స్పందించడంలేదు. ఇప్పుడు ఏం చేయాలి?