సెన్సెక్స్‌ @ 49,000 - sensex reached 49000 pts
close

Updated : 11/01/2021 09:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సెన్సెక్స్‌ @ 49,000

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు ఈ వారాన్ని భారీ లాభాలతో ప్రారంభించాయి. సెన్సెక్స్‌ తొలిసారి 49000 మార్క్‌ను దాటింది. నిఫ్టీ సైతం అదే జోరును కొనసాగిస్తోంది. సోమవారం ఉదయం 9:35 గంటల సమయంలో సెన్సెక్స్‌ 391 పాయింట్లు లాభపడి 49,177 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 108 పాయింట్ల ఎగబాకి 14,456 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.24 వద్ద కొనసాగుతోంది. టెక్‌ కంపెనీల షేర్లు రాణిస్తున్నాయి. ఆర్థిక వ్యవస్థ వృద్ధి వేగం పుంజుకుంటోందన్న సంకేతాలు, టీకా పంపిణీ, విదేశీ నిధుల ప్రవాహం కొనసాగుతుండడం వంటి పరిణామాలు మదుపర్ల సెంటిమెంటును పెంచాయి.

ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, విప్రో, టాటా మోటార్స్‌, ఐటీసీ లిమిటెడ్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. టాటా స్టీల్‌, హిందాల్కో ఇండస్ట్రీస్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, అదానీ పోర్ట్స్‌, మారుతీ సుజుకీ షేర్లు నష్టాల్ని చవిచూస్తున్నాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని