ప్చ్‌.. బుల్‌ ఇంకా కోలుకోలేదు!! - sensex tanks 588 points to close at 46285
close

Published : 29/01/2021 16:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్చ్‌.. బుల్‌ ఇంకా కోలుకోలేదు!!

వరుసగా ఆరో రోజూ.. ‘బేర్‌’మన్న మార్కెట్లు

బడ్జెట్‌ చికిత్స కోసం ఎదురుచూపులు

ముంబయి: కేంద్ర బడ్జెట్‌కు ముందు దేశీయ మార్కెట్లు కుదేలయ్యాయి. అమ్మకాల ఒత్తిడితో వరుసగా ఆరో రోజూ బేర్‌మన్నాయి. సాధారణ బడ్జెట్‌ నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తత పాటించడం, లాభాల స్వీకరణకు మొగ్గుచూపడం సూచీల సెంటిమెంట్‌ను బలంగా దెబ్బతీసింది. ఫలితంగా ఈ వారమంతా మార్కెట్లు నష్టాలను చవిచూశాయి. 

ఆరంభ లాభాలు ఆవిరి..

గత ఐదు సెషన్లలో భారీ నష్టాలను మూటగట్టుకున్న సూచీలు ఈ ఉదయం కోలుకున్నట్లే కన్పించాయి. అంతర్జాతీయ మార్కెట్ల అండతో ఉదయం లాభాల్లో ప్రారంభమయ్యాయి. 200 పాయింట్ల లాభంతో మొదలైన సెన్సెక్స్‌ ఒక దశలో 400 పాయింట్లకు పైగా ఎగబాకింది. నిఫ్టీ కూడా 13,900 పైనే ట్రేడ్‌ అయ్యింది. అయితే సూచీల ఉత్సాహం ఎంతోసేపు నిలువలేదు. ఆర్థిక సర్వే నేపథ్యంలో మదుపర్లు ఆచితూచి వ్యవహరించడంతో ఒడుదొడుకులకు లోనైన సూచీలు మధ్యాహ్నానికి నష్టాల్లోకి జారుకున్నాయి. ఆ తర్వాత ఏ దశలోనూ కోలుకోలేని మార్కెట్లు.. భారీ నష్టాలను చవిచూశాయి.

నేటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌.. 588.59 పాయింట్లు దిగజారి 46,285 వద్ద, నిఫ్టీ 182.95 పాయింట్ల నష్టంతో 13,634.60 వద్ద స్థిరపడ్డాయి. ఎన్‌ఎస్‌ఈలో ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, సన్‌ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ షేర్లు లాభపడగా.. రెడ్డీస్‌ ల్యాబ్స్‌, మారుతీ సుజుకీ, హీరో మోటార్స్‌, టాటాస్టీల్‌, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు నష్టపోయాయి. మార్కెట్‌ సెషన్‌ మళ్లీ సోమవారం ఉంటుంది. అదే రోజున కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ ప్రవేశపెట్టనుంది. మరి బడ్జెట్‌ రోజునైనా బుల్‌ కోలుకుంటుందో లేదో చూడాలి..!

ఇవీ చదవండి..

బడ్జెట్‌లో సగటు జీవి సంగతేంటో..!

మరోసారి జియోను దాటి.. ఎయిర్‌టెల్‌ టాప్‌


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని