బుల్‌ బోల్తా..! - sensex tumbles 500 points
close

Published : 28/01/2021 09:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బుల్‌ బోల్తా..!

 మరోసారి సెన్సెక్స్‌ 500 పాయింట్ల పతనం

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశీయ స్టాక్‌ మార్కెట్ల పతనం కొనసాగుతోంది. గురువారం మార్కెట్లు ఒక దశలో 500 పాయింట్ల కంటే అధికంగా పతనమయ్యాయి. ఉదయం 9.34 సమయానికి సెన్సెక్స్‌ 441 పాయింట్లు కుంగి 46,968 వద్ద, నిఫ్టీ 117 పాయింట్లు పడిపోయి 13,849 వద్ద ట్రేడవుతున్నాయి. కాస్మోఫిల్మ్స్‌‌, మెజెస్కో, వొడాఫోన్‌ ఐడియా, ఆస్ట్రల్‌ పాలీ, ఐనాక్స్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. పటేల్‌ ఇంజినీరింగ్‌, పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌, వక్రాంజ్‌, జేకే పేపర్‌, జేకే టైర్‌ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. 

ఇప్పటికే మధుపరుల లాభాల స్వీకరణలతో మార్కెట్లు గత ఐదు రోజుల్లో బాగా విలువ కోల్పోయాయి. దీనికి తోడు నేడు డెరివేటీవ్‌ల చివరి రోజు కావడంతో విక్రయాలు కొనసాగాయి. ఎనర్జీ, గ్యాస్‌ రంగాల సూచీలు తప్పితే మిగిలినవి మొత్తం నష్టాల్లో ఉన్నాయి. మరోపక్క బడ్జెట్‌ కూడా సమీపిస్తుండటంతో ఇన్వెస్టర్లు ఆచీతూచీ వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే జీవనకాల గరిష్ఠాల్లో ఉన్న సూచీలు బడ్జెట్‌లో ప్రతికూల నిర్ణయాలు ఏమాత్రం తట్టుకొనే పరిస్థితి లేదు. దీంతో ముందుజాగ్రత్తగా షేర్లను విక్రయిస్తున్నారు. 

ఇవీ చదవండి

కొవాగ్జిన్‌తో యూకే రకం కొవిడ్‌ కట్టడి
హెచ్‌యూఎల్‌ లాభం రూ.1,938 కోట్లు


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని