కొంప ముంచిన లాభాల స్వీకరణ - sensex tumbles 549 pts nifty drops below 14450
close

Published : 15/01/2021 16:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొంప ముంచిన లాభాల స్వీకరణ

ముంబయి: దేశీయ మార్కెట్లు ఈ వారాన్ని భారీ నష్టాలతో ముగించాయి. అంతర్జాతీయ మార్కెట్ల బలహీన సంకేతాలతో దేశీయంగా దిగ్గజ షేర్లు కుదేలవడం సూచీల సెంటిమెంట్‌ను దెబ్బకొట్టింది. మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడం సూచీల పతనానికి కారణమైంది. 

ఈ ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైన సూచీలు.. అమ్మకాల ఒత్తిడితో అంతకంతకూ పడిపోయాయి. ఒక దశలో సెన్సెక్స్‌ ఏకంగా 620 పాయింట్లకు పైనే పతనమైంది. నిఫ్టీ కూడా 180 పాయింట్ల నష్టంతో ట్రేడ్‌ అయ్యింది. చివరకు కాస్త కోలుకున్నట్లే కన్పించినా భారీ నష్టాలు తప్పలేదు. నేటి సెషన్‌లో సెన్సెక్స్‌ 549.49(1.11శాతం) పాయింట్లు దిగజారి 49,034.67 వద్ద, నిఫ్టీ 161.90(1.11శాతం) పాయింట్ల నష్టంతో 14,433.70 వద్ద స్థిరపడ్డాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 73.07గా కొనసాగుతోంది. 

నిఫ్టీలో టెక్‌ మహీంద్రా, గెయిల్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, విప్రో, ఓఎన్జీసీ షేర్లు భారీగా నష్టపోగా.. టాటామోటార్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌, యూపీఎల్‌ లిమిటెడ్‌, ఐటీసీ, గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు స్వల్పంగా లాభపడ్డాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టాలను చవిచూశాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ 1శాతం మేర పడిపోయింది. 

అమెరికాకు కాబోయే అధ్యక్షుడు జో బైడెన్‌.. ఆ దేశ ఆర్థిక వ్యవస్థ ఊతానికి 1.9 ట్రిలియన్‌ డాలర్ల ఉద్దీపన ప్యాకేజీని ప్రతిపాదనను ప్రకటించారు. అయితే ఈ ప్యాకేజీ ఆశించిన మేర లేకపోవడం వాల్‌స్ట్రీట్‌ సూచీలపై ప్రతికూల ప్రభావం చూపించింది. ఫలితంగా ఆసియా మార్కెట్లు డీలా పడ్డాయి. ఇది దేశీయ మార్కెట్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. మరోవైపు గత కొన్ని రోజులుగా స్టాక్‌ మార్కెట్లు కొత్త రికార్డుల్లో ట్రేడ్‌ అవుతుండటంతో నేటి ట్రేడింగ్‌లో మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడం కూడా సూచీల సెంటిమెంట్‌ను దెబ్బతీసినట్లు మార్కెట్‌ విశ్లేషకులు చెబుతున్నారు.

ఇవీ చదవండి..

14శాతం విక్రయాలు ఆన్‌లైన్‌లోనే..

మళ్లీ కొరడా తీసిన ట్రంప్‌..!


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని