‘బేర్‌’మన్న మార్కెట్లు - sensex tumbles 750 points over profit booking
close

Published : 22/01/2021 16:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘బేర్‌’మన్న మార్కెట్లు

ముంబయి: బుల్‌ దూకుడుకు భల్లూకం అడ్డుపడింది. అమ్మకాల ఒత్తిడికి మార్కెట్‌ కుదేలైంది. ఫలితంగా ఈ వారాన్ని సూచీలు భారీ నష్టాలతో ముగించాయి. బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ సెన్సెక్స్‌ దాదాపు 750 పాయింట్లు పతనమవ్వగా.. జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ నిఫ్టీ 14,400 మార్క్‌ను కోల్పోయింది. 

అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు, దిగ్గజ రంగాల షేర్లలో జరిగిన లాభాల స్వీకరణతో ఈ ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు.. అంతకంతకూ దిగజారాయి. 49,594 పాయింట్ల వద్ద మొదలైన సెన్సెక్స్‌ ఇంట్రాడేలో 48,832 కనిష్ఠ స్థాయికి పడిపోయింది. చివరకు 746 .22 పాయింట్లు పతనమై 48,878.54వద్ద స్థిరపడింది. అటు నిఫ్టీ కూడా భారీగానే నష్టపోయింది. 14,583 పాయింట్ల వద్ద ప్రారంభమైన సూచీ.. ఒక దశలో 14,357.75 వద్ద కనిష్ఠ స్థాయికి దిగజారింది. చివరకు 218 పాయింట్ల నష్టంతో 14,371.90 వద్ద ముగిసింది. 

రంగాల వారీగా.. లోహ, ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ షేర్లు కుదేలయ్యాయి. 3శాతం మేర కుంగాయి. ఎనర్జీ, ఫార్మా షేర్లు ఒక శాతం వరకు నష్టపోయాయి. నిఫ్టీలో యాక్సిస్‌ బ్యాంక్, ఏషియన్‌ పెయింట్స్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, హిందాల్కో, ఎస్‌బీఐ షేర్లు భారీగా నష్టపోగా.. బజాజ్‌ ఆటో, హీరో మోటార్స్‌, ఐషర్‌మోటార్స్‌, టీసీఎస్‌, హిందుస్థాన్‌ యునిలివర్‌ షేర్లు రాణించాయి. 

అంతర్జాతీయ మార్కెట్ల అండతో గురువారం సెన్సెక్స్‌ తొలిసారిగా 50వేల మార్క్‌ను తాకిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో నిన్న స్వల్ప నష్టాలతో ముగిసిన సూచీలు.. నేడు కూడా అదే పరంపర కొనసాగించాయి. 

ఇదీ చదవండి..

ఎన్‌పీఏల సమస్యకు బ్యాడ్‌ బ్యాంక్‌ పరిష్కారమా?


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని