రికార్డు స్థాయికి స్టాక్‌ మార్కెట్‌ సూచీలు - sensex up by 200 pts
close

Updated : 13/01/2021 10:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రికార్డు స్థాయికి స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

ముంబయి: స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వరుసగా నాలుగో రోజూ దూసుకెళ్తున్నాయి. సెన్సెక్స్‌ 50 వేల మార్క్‌ దిశగా పయనిస్తోంది. బుధవారం మార్కెట్లు ఆరంభం నుంచే రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఉదయం 9:44 గంటల సమయంలో సెన్సెక్స్‌ 265 పాయింట్లు లాభపడి 49,782 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 87 పాయింట్ల లాభంతో 14,647 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.41 వద్ద కొనసాగుతోంది. కరోనా నుంచి ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు కోలుకోనున్నాయన్న సంకేతాలు మదుపర్లను నడిపిస్తున్నాయి. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా కదలాడుతున్నాయి. ఇక డిసెంబరు నాటి రిటైల్‌ ద్రవ్యోల్బణం 4.59శాతానికి పడిపోవడం కూడా మదుపర్లను ప్రభావితం చేస్తోంది. 

భారతీ ఎయిర్‌టెల్‌, ఓఎన్‌జీసీ, భారత్‌ పెట్రోలియం, టాటా మోటార్స్‌ లిమిటెడ్‌, ఐవోసీ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. టైటాన్‌ కంపెనీ, టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఇన్ఫోసిస్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ షేర్లు నష్టాల్ని చవిచూస్తున్నాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని