లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు - sensex up by 250 pts
close

Updated : 08/01/2021 09:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు లాభాల్లో పయనిస్తున్నాయి. శుక్రవారం ఉదయం 9:40 గంటల సమయంలో సెన్సెక్స్‌ 369 పాయింట్లు లాభపడి 48,462 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 112 పాయింట్ల నష్టంతో 14,250 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.06 వద్ద కొనసాగుతోంది. ఆసియా మార్కెట్లన్నీ భారీ లాభాల్లో పయనిస్తున్నాయి. జపాన్‌ సూచీలు మూడు దశాబ్దాల గరిష్ఠాల్ని నమోదు చేస్తున్నాయి. అధ్యక్షుడిగా బైడెన్‌ ఎన్నిక ఖాయమవడంతో సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు అమెరికా ప్రభుత్వం భారీగా ఖర్చు పెట్టే అవకాశం ఉందన్న సంకేతాలు మదుపర్ల సెంటిమెంటును పెంచింది. అమెరికా మార్కెట్లు గురువారం కళకళలాడాయి. ఈ పరిణామాల నేపథ్యంలోనే దేశీయ సూచీలు లాభపడుతున్నాయి.

యూపీఎల్‌, భారత్‌ పెట్రోలియం, ఇన్ఫోసిస్‌, సన్‌ ఫార్మా, ఐషర్‌ మోటార్స్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. హిందాల్కో ఇండస్ట్రీస్‌, టైటాన్ కంపెనీ, హెచ్‌డీఎఫ్‌సీ, టాటా స్టీల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ షేర్లు నష్టాల్ని చవిచూస్తున్నాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని