లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు - sensex up by 250 pts
close

Published : 20/01/2021 10:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లలో మంగళవారం నాటి లాభాల పరంపర కొనసాగుతోంది. బుధవారం ఉదయం 9:45 గంటల సమయంలో సెన్సెక్స్‌ 112 పాయింట్లు లాభపడి 49,510 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 34 పాయింట్ల లాభంతో 14,555 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.21 వద్ద కొనసాగుతోంది. అమెరికాలో భారీ ఉద్దీపన ప్యాకేజీని ఆవిష్కరించనున్నామన్న కాబోయే ట్రెజరీ సెక్రటరీ జానెట్‌ యెల్లెన్ ప్రకటనతో ఆసియా మార్కెట్లు రికార్డు స్థాయి గరిష్ఠాలకు చేరుకున్నాయి. దీనికి తోడు కీలక కంపెనీల షేర్లు రాణిస్తుండడం సూచీలకు కలిసొచ్చింది.

టాటా మోటార్స్‌, విప్రో, టెక్‌ మహీంద్రా, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఇన్ఫోసిస్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌, శ్రీ సిమెంట్‌, యూపీఎల్‌, గెయిల్‌, బజాజ్‌ ఫినాన్స్‌ షేర్లు నష్టాల్ని చవిచూస్తున్నాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని