కొనసాగుతున్న మార్కెట్ల జైత్రయాత్ర! - sensex up by 400 pts
close

Published : 05/02/2021 09:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొనసాగుతున్న మార్కెట్ల జైత్రయాత్ర!

ముంబయి: 2021-22 బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ హామీలతో జోరందుకున్న మార్కెట్లు ఆ లాభాల పరంపరను ఇంకా కొనసాగిస్తున్నాయి. తాజాగా శుక్రవారం ఉదయం 417 పాయింట్ల లాభంతో ప్రారంభమైన సెన్సెక్స్‌ 51,031 తాజా జీవనకాల గరిష్ఠాన్ని నమోదుచేసింది. నిఫ్టీ సైతం తొలిసారి 15,000 మార్క్‌ను అందుకుంది. ఉదయం 09:41 గంటల సమయంలో సెన్సెక్స్‌ 368 పాయింట్లు లాభపడి 50,982 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 91 పాయింట్ల లాభంతో 14,987 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.72.89 వద్ద కొనసాగుతోంది. ఆర్‌బీఐ పరపతి విధాన సమీక్షకు ముందు మదుపర్లు సానుకూలంగా స్పందిస్తుండడం గమనార్హం.

ఎస్‌బీఐ, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, కొటాక్ మహీంద్రా బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. కోల్‌ ఇండియా, మహీంద్రా అండ్ మహీంద్రా, పవర్‌ గ్రిడ్ కార్పొరేషన్‌, టీసీఎస్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ షేర్లు నష్టాల్ని చవిచూస్తున్నాయి.

ఇదీ చదవండి...

2,00,000,00 కోట్లు


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని