11 నెలల కనిష్ఠానికి సేవా కార్యకలాపాలు - services shrink to 11 month low
close

Updated : 05/07/2021 13:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

11 నెలల కనిష్ఠానికి సేవా కార్యకలాపాలు

దిల్లీ: జూన్‌లో సేవా రంగ కార్యకలాపాలు 11 నెలల కనిష్ఠానికి చేరాయి. ఈ రంగంలో పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్(పీఎంఐ) 41.2గా నమోదైంది. అంతకుముందు నెలలో ఇది 46.4గా రికార్డయింది. పీఎంఐ 50కి దిగువన నమోదవ్వడం వరుసగా ఇది రెండో నెల. పీఎంఐ సూచీ 50 పాయింట్లను మించితే ఆ రంగంలో వృద్ధిని సూచిస్తుంది. 50 పాయింట్ల లోపు ఉంటే క్షీణతకు సంకేతం. ఈ మేరకు ఐహెచ్ఎస్​ మార్కిట్​ నెలవారీ నివేదిక సోమవారం విడుదలైంది.

రెండో దశ కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంలో సేవారంగం దెబ్బతిననుందని ముందే అంచనా వేసినట్లు ఐహెచ్‌ఎస్‌ మార్కిట్‌ ప్రతినిధి లీమా తెలిపారు. వ్యాపారాలు, ఉత్పత్తి, ఉద్యోగాలు వేగంగా పడిపోయాయని పేర్కొన్నారు. అయితే, తొలి వేవ్‌తో పోలిస్తే పరిస్థితులు కాస్త మెరుగ్గానే ఉన్నాయన్నారు.  కేసుల విజృంభణ ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో ఏప్రిల్‌లో ఈ రంగం మరింత నెమ్మదించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.

మరోవైపు నిర్వహణ, పెట్టుబడి వ్యయాలు పెరిగిపోయాయని సర్వే వెల్లడించింది. దీంతో రానున్న నెలల్లో ద్రవ్యోల్బణం ఆర్‌బీఐ నిర్దేశించుకున్న 2-6 శాతాన్ని మించిపోవచ్చని అంచనా వేసింది. మరోవైపు తయారీ కార్యకలాపాలు సైతం కుంగిన విషయం తెలిసిందే. దీంతో తయారీ, సేవల కాంపొజిట్‌ ఇండెక్స్‌ జూన్‌లో 43.1 శాతానికి కుంగింది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని