close

Updated : 16/01/2021 09:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కరోనా అవకాశాలను భారత ఫార్మా అందిపుచ్చుకుంది

 డాక్టర్‌ రెడ్డీస్‌ సతీశ్‌ రెడ్డి

దిల్లీ: కరోనా సంక్షోభంలో ప్రజలకు ఔషధాలు, టీకాలు అభివృద్ధి చేయడంలో వచ్చిన అవకాశాలను భారత ఫార్మా పరిశ్రమ సరిగ్గా అందిపుచ్చుకుందని డాక్టర్‌ రెడ్డీస్‌ ఛైర్మన్‌ సతీశ్‌ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం జరిగిన 25వ వార్టన్‌ ఇండియా ఎకనమిక్‌ ఫోరమ్‌లో ఆయన మాట్లాడుతూ ‘ఈ సంక్షోభం ఫార్మాకు పలు అవకాశాలను ఇచ్చింది. వైవిధ్యంగా ఆలోచించడానికి వీలు కల్పించింది. రోగుల ప్రయోజనాల కోసం అత్యవసరం స్పందించింది. అందుబాటులో, సరసమైన ధరలకు ఔషధాలను అందించగలిగింది. టీకాల విషయంలోనూ కరోనా కంటే ముందు కూడా ప్రపంచంలో భారతే ముందుంది. అంతర్జాతీయ టీకాల ఉత్పత్తిలో 60 శాతం భారత్‌ నుంచే వెలువడుతున్నా’యని ఆయన అన్నారు. ఆక్స్‌ఫర్డ్‌తో సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లే.. రష్యాకు చెందిన గమలేయ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రష్యాతో డాక్టర్‌ రెడ్డీస్‌ టీకా అభివృద్ధి కోసం జట్టు కట్టిన విషయం విదితమే.
ఛత్రపతి శివాజీ మహారాజ్‌ టర్మినస్‌ పునరాభివృద్ధి రేసులో జీఎమ్‌ఆర్‌
ముంబయి: ప్రపంచ వారసత్వ ప్రాంతాల్లో ఒకటైన ఛత్రపతి శివాజీ మహారాజ్‌ టర్మినస్‌(సీఎస్‌ఎమ్‌టీ) పునరాభివృద్ధికి సంబంధించిన రూ.1,640 కోట్ల ప్రాజెక్టు కోసం జీఎమ్‌ఆర్‌ ఎంటర్‌ప్రైజెస్‌, అదానీ గ్రూప్‌ సహా 10 కంపెనీలు బరిలో నిలిచాయి. 170 ఏళ్ల కిందట తొలి రైలు ఈ స్టేషన్‌లో ప్రారంభమైంది. ఇపుడు దీనిని నాలుగేళ్ల కాలంలో దశలవారీగా అభివృద్ధి చేయనున్నట్లు రైల్వేస్‌స్టేషన్‌డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌(ఐఆర్‌ఎస్‌డీసీ) అధికారులు పేర్కొన్నారు. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం(పీపీపీ) ద్వారా జరిగే ఈ ప్రాజెక్టు కోసం పై రెండు సంస్థలతో పాటు కల్పతరు పవర్‌, బ్రూక్‌ఫీల్డ్‌ ఇన్‌ఫ్రా, గోద్రేజ్‌ ప్రోపర్టీస్‌, కీస్టోన్‌ రియల్టర్స్‌, ఒబెరాయ్‌ రియల్టీలు కూడా బిడ్‌లు దాఖలు చేశాయి.

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని