‘స్మార్ట్‌ స్విచ్‌’ వేయనున్న నిర్మలమ్మ - smart switch windows and opaque doors to greet rajdhani passengers
close

Published : 29/01/2021 12:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘స్మార్ట్‌ స్విచ్‌’ వేయనున్న నిర్మలమ్మ

 రైల్వేల్లో కొత్త టెక్నాలజీ

ఇంటర్నెట్‌డెస్క్‌: ఈ సారి రైల్వేల్లో భద్రతకు సంబంధించి ప్రభుత్వం కొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దీంతోపాటు ఇది ప్రయాణికులకు మరింత సౌకర్యవంతంగా మారనుంది. రైల్వేల ఆధునికీకరణలో ఓ మెట్టుగా నిలవనుంది. త్వరలోనే దిల్లీ-హౌరా రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికులందరికీ ఈ సరికొత్త ఫీచర్‌ అందుబాటులోకి వస్తోంది. స్మార్ట్‌ స్విచ్‌ ఆన్‌ చేస్తే రైలు బోగీ కిటికీలు.. లోపలి తలుపులు పారదర్శకంగా మారతాయి. స్విచ్‌ ఆఫ్‌ చేసి వాటిని అవసరమైతే అపారదర్శకంగా మార్చేసుకోవచ్చు. ఇది ప్రయాణికులను  అతినీలలోహిత కిరణాల నుంచి కాపాడుతుంది. అంతేకాదు.. బయట వారికి ప్రయాణికులు కనిపించరు. ఇది వారికి ప్రైవసీని కల్పిస్తుంది. ఇదే విధంగా బోగీల మధ్య ఉన్న గ్లాస్‌ డోర్లను కూడా మార్చనున్నారు.

కొవిడ్‌ -19 వ్యాప్తి నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా రైళ్లలోని కర్టెన్లను తొలగించి ఇటువంటి విండో గ్లాస్‌లను ఏర్పాటు చేయనున్నారు. ఈ సౌకర్యాన్ని రైల్వే శాఖ మిగిలిన రైళ్లకు కూడా విస్తరించే అవకాశం ఉంది. వచ్చే బడ్జెట్‌లో రైల్వే ఆధునికీకరణకు కేటాయింపులు పెంచవచ్చు.

ఇదీ చదవండి

బడ్జెట్‌ సంజీవని అవుతుందా?

నేటి నుంచే బడ్జెట్‌ పర్వం


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని