అందుబాటులోకి రానున్న స్పుత్నిక్‌-వి టీకా - sputnik v vaccine to get approval from indian regulator in next few weeks dr reddys expects
close

Updated : 29/03/2021 16:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అందుబాటులోకి రానున్న స్పుత్నిక్‌-వి టీకా

డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ అంచనా

హైదరాబాద్‌: రష్యా తయారు చేసిన స్పుత్నిక్‌-వ్యాక్సిన్‌ వినియోగానికి భారత్‌లో మరికొన్ని వారాల్లో అనుమతి లభించే అవకాశం ఉన్నట్లు డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ ఏపీఐ, సర్వీసెస్‌ సీఈఓ దీపక్‌ సప్రా తెలిపారు. భారత్‌లో ఈ టీకాను సరఫరా చేసేందుకు ‘రష్యా డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌‌ ఫండ్ ‌(ఆర్‌డీఐఎఫ్‌)’తో డాక్టర్‌ రెడ్డీస్‌ ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా భారత్‌లో రెండు, మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించారు. వాటి మధ్యంతర ఫలితాల్ని భారత ఔషధ నియంత్రణ సంస్థకు అందజేశారు.

స్పుత్నిక్‌-వి రెండు డోసుల టీకా అని దీపక్‌ తెలిపారు. తొలి డోసు ఇచ్చిన తర్వాత 21వ రోజు రెండో డోసు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. 28 నుంచి 42 రోజుల మధ్య కరోనా వైరస్‌ను సమర్థంగా ఎదుర్కొనే రోగనిరోధకత అభివృద్ధి చెందుతుందని వెల్లడించారు. భారత్‌, రష్యా, యూఏఈ సహా మరికొన్ని దేశాల్లో క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించినట్లు తెలిపారు. 91.6 శాతం సామర్థ్యం కనబరిచినట్లు వెల్లడించారు. ఈ ఫలితాలు ప్రముఖ మెడికల్‌ జర్నల్‌ లాన్సెట్‌లోనూ ప్రచురితమైనట్లు తెలిపారు.

రష్యాలో రూపొందించిన స్పుత్నిక్‌-వి టీకాకు భారత్‌లో అనుమతి లభించాలంటే.. వ్యాక్సిన్‌కు సంబంధించి రెండు, మూడో దశ ప్రయోగాలను ఇక్కడ కూడా నిర్వహించాల్సి ఉంటుంది. ఇందులో భాగంగానే డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ భారత్‌లో క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహిస్తోంది. అంతేకాకుండా ప్రయోగాల అనంతరం పది కోట్ల డోసులను భారత్‌లో సరఫరా చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని