‘ఉక్కు’సంకల్పం అవసరం..! - steel industry pitches for lower duty on inputs steps to fast-track infrastructure projects
close

Updated : 25/01/2021 17:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘ఉక్కు’సంకల్పం అవసరం..!

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశంలో అభివృద్ధి పనులు ఏ స్థాయిలో  జరుగుతున్నాయో అంచనా వేసేందుకు ఉక్కు వినియోగాన్ని పరిగణనలోకి తీసుకొంటారు. దీనిని వాడకం తక్కువ ఉన్న దేశంలో పరిశ్రమలు మౌలిక వనరుల అభివృద్ధి తక్కువగా ఉంటుంది. 2020-21 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో లాక్‌డౌన్‌ కారణంగా భారత్‌లో స్టీల్‌ డిమాండ్‌ గణనీయంగా పడిపోయింది. దీనికి ప్రపంచ దేశాలకు కూడా ఎగుమతులు దాదాపు నిలిచిపోయాయి.  ఇటీవల కాలంలో ఆటోమొబైల్‌, గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్‌ పుంజుకోవడంతో ఈ రంగం కోలుకుంది. వాస్తవానికి ప్రతి బడ్జెట్‌లో ఈ రంగానికి తగినంత కేటాయింపులు జరుగుతాయి. కానీ, ఈ సారి ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం ప్రభుత్వ చర్యలపై ఆశలు పెట్టుకొంది. 

ప్రభుత్వం 2020-25 మధ్యలో నేషనల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ పైప్‌లైన్‌ ప్రాజెక్టును ప్రకటించింది. దీనికి సుమారు రూ.111 లక్షల కోట్లు ఖర్చవుతాయని అంచనావేసింది.  ఇది ఉక్కు డిమాండ్‌కు అత్యంత కీలకమైంది. దీనిలో 40శాతం రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పెట్టుబడి రూపంలో రావాలి. కానీ, కొవిడ్‌, జీఎస్‌టీ ఆదాయాలు తగ్గడం వంటి కారణాలతో ఆ పరిస్థితి లేదు. దీంతో రాష్ట్రాలు కోలుకొనే వరకు కేంద్రం,  ప్రభుత్వ రంగ పరిశ్రమలు తమ వాటా వ్యయాలను పెంచాల్సి ఉంటుంది.

ఇక స్టీలు రంగం కోలుకోవాలంటే రియల్‌ ఎస్టేట్‌ కూడా స్థిరంగా ఉండాలి. ప్రస్తుతం రియల్‌ ఎస్టేట్‌ పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. దీంతో ప్రభుత్వం రియల్‌ ఎస్టేట్‌ కోలుకొనేట్లు వడ్డీరేట్లను సవరించడం, లేదా రాయితీలు ఇవ్వడం చేయాలి. ఇప్పటికే కర్ణాటక, మహారాష్ట్ర వంటి చోట్ల రియల్‌ ఎస్టేట్‌ కోలుకొనేందుకు చర్యలు చేపట్టారు.  స్టీల్‌ ఉత్పత్తి వ్యయం తగ్గించాలంటే  కీలకమైన ఇన్‌పుట్‌ వ్యయానికి కళ్లెం వేయాలి. దీనికోసం ప్రభుత్వం పలు కీలక చర్యలు తీసుకుంది

* ఒడిశాలోని మరిన్ని ఐరన్‌ఓర్‌ గనులను వేలానికి తీసుకొచ్చింది.

* గనులకు సంబంధించిన కీలక అనుమతులు వేగవంతం చేసేందుకు ఎంఎండీఆర్‌ఏ చట్టన్ని సవరించింది.

* సెయిల్‌ ఐరన్‌ ఓర్‌ డంప్‌ల్లో కొంత మొత్తాన్ని ఓపెన్‌ మార్కెట్లో విక్రయించడానికి అనుమతులు ఇవ్వాలి.

* వాణిజ్య బొగ్గుగనుల మైనింగ్‌కు అనుమతి ఇచ్చింది.

వాస్తవానికి ఈ చర్యల తర్వాత కూడా దేశంలో ఐరన్‌ ఓర్‌కు కొరత ఏర్పడింది. దీనిని తగ్గించుకోవాలంటే ప్రస్తుతం ఉన్న హెవిమెటల్‌ ఫెర్రాయిస్‌ స్క్రాప్‌పై ఉన్న 2.5శాతం దిగుమతి సుంకాన్ని తొలగించాలి.  దీంతోపాటు గనుల అన్వేషణలో ప్రైవేటు రంగం మరింత చురుగ్గా పాల్గొనేలా చర్యలు తీసుకోవాలి. 

* దేశీయ కోకింగ్‌ కోల్‌ను బ్లాస్ట్‌ ఫర్నెస్‌లో వినియోగించేలా వాషెరీస్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం రాయితీలు ఇవ్వాలి.

* దేశీయ స్టీల్‌ కంపెనీలకు అత్యాధునిక సాంకేతికతను అందించేలా పరిశోధన సంస్థలను ఏర్పాటు చేయాలి. 

ఇవీ చదవండి

పెట్రోమంటలకు బడ్జెట్‌లో ఉపశమనం..?

సీతమ్మా.. రాయితీలివ్వమ్మా


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని